Chiranjeevi: వైరల్ అవుతున్న మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!

టాలీవుడ్ మెగా హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో నేటి హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా కరోనా బారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తన ఆరోగ్యం గురించి తెలియజేశారు.

ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేడు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు జరుపుకోవడంతో మెగాస్టార్ పోస్ట్ లో తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అమ్మా జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. క్వారంటైన్ అయిన కారణంగా మీ ఆశీస్సులను ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నాను.

మీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా అభినందనలతో శంకర్ బాబు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఇక ఈ ట్వీట్ లో చిరంజీవి తన భార్య సురేఖ ఇద్దరు తన తల్లి అంజనాదేవితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. క్వారంటైన్ లో ఉంటూ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ఆయన నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అలాగే గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు షూటింగ్ పనులు జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటంతో ఈ సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus