Chiranjeevi: ఫ్యాన్స్ కోరికను మెగాస్టార్ చిరంజీవి నెరవేరుస్తారా?

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి నటిస్తున్న రీమేక్ సినిమాల విషయంలో ఫ్యాన్స్ సంతృప్తితో లేరు. రీమేక్ సినిమాలలో నటించి సక్సెస్ సాధించినా ఆ క్రెడిట్ హీరోలకు పూర్తిస్థాయిలో దక్కడం లేదు. భోళా శంకర్ మూవీ విషయంలో కూడా ఫ్యాన్స్ సంతృప్తితో లేరు. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో చిరంజీవి రీమేక్ సినిమాలలో నటించకుండా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రీమేక్ సినిమాలలో నటించడం వల్ల విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. భవిష్యత్తులో రీమేక్ సినిమాలలో చిరంజీవి కెరీర్ ను కొనసాగిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం చిరంజీవికి రీమేక్ సినిమాల వల్ల నష్టం కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తేరి రీమేక్ లో నటించనున్నారంటూ జరిగిన ప్రచారం కూడా ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తేరి రీమేక్ విషయంలో ఫ్యాన్ పవన్ ఫ్యాన్స్ ఒకరు సూసైడ్ చేసుకుంటానని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. రీమేక్ సినిమాలు ఫ్యాన్స్ ను ఏ స్థాయిలో హర్ట్ చేస్తున్నాయో ఈ ఘటనల వల్ల ప్రూవ్ అవుతోంది. ఓటీటీల హవా నేపథ్యంలో ప్రస్తుతం రీమేక్ సినిమాలను ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు. రీమేక్ సినిమాల విషయంలో సాధారణ అభిమానులు సైతం సంతృప్తితో లేరు. ఓటీటీల హవా పెరిగిన నేపథ్యంలో రీమేక్ సినిమాలపై నెగిటివిటీ పెరుగుతోంది. రీమేక్ సినిమాలకు బిజినెస్ భారీ స్థాయిలో జరగడం లేదు.

మెగా హీరోలకు ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాల కంటే స్ట్రెయిట్ సినిమాలే మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి. టాలీవుడ్ స్టార్స్ ఇకనైనా రీమేక్ లకు దూరంగా ఉంటారేమో చూడాల్సి ఉంది. రీమేక్ సినిమాల్లో నటించకూడదనే ఫ్యాన్స్ కోరికను చిరంజీవి తీరుస్తారో లేదో చూడాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus