అందుకే మెగాస్టార్ తెగ కంగారు పడుతున్నారట?

దాదాపు పదేళ్ళ తరువాత రీఎంట్రీ ఇస్తున్నప్పుడు ఎటువంటి కథని ఎంచుకోవాలి.. అభిమానులు, ప్రేక్షకులు ఎటువంటి కథనైతే ఆదరిస్తారు..? ఈ విషయాలన్నీ మెగాస్టార్ చిరంజీవికి బాగా తెలుసు. అందుకే ‘కత్తి’ రీమేక్ ను ఎంచుకుని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. చిరు జడ్జిమెంట్ అలా ఉంటుంది మరి. కానీ సైరా విషయంలో మాత్రం మెగాస్టార్ కాస్త కంగారు పడుతున్నారని సమాచారం. అసలే చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అందుకే ఏమాత్రం ఖర్చుకి వెనుకాడకుండా చిరంజీవి తనయుడు రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ గొప్పగా ఉండేలా చూడాలని కండిషన్ పెట్టారట చిరు. పైగా ‘బాహుబలి’ చిత్రంతో రాజమౌళి విఎఫ్ఎక్స్ పరంగా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాడు. దీంతో ఆ ఫార్మాట్ లో వచ్చే ప్రతీ పెద్ద సినిమా అదే స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అందుకే చిరు టెన్షన్ పడుతున్నారట. ‘మొదట్లో చేసిన విఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేవని మళ్ళీ మొదటి నుండీ ఆ పనులు మొదలు పెడుతున్నారని సమాచారం. స్వదేశీ, విదేశీ కంపెనీలు ‘సైరా’ విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నారట. పనులైతే రాత్రి పగలు కష్టపడి చేస్తున్నారట. త్వరలోనే ఫైనల్ కాపీ కూడా రెడీ అవ్వబోతుందట. అందులో గొప్పగా రాకాపోతే.. మాత్రం రిజల్ట్ దెబ్బతింటుందని మెగాస్టార్ టెన్షన్లో ఉన్నారట. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి అండ్ టీమ్ మాత్రం చిత్రం అనుకున్నదానికంటే గొప్పగా వస్తోందని, ఎటువంటి టెన్షన్ అవసరం లేదని చెబుతున్నారట. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus