Chiranjeevi,Pawan Kalyan: పవన్ చిరు కాంబోలో భారీ మల్టీస్టారర్.. చిరు కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విలేకరుల నుంచి చిరంజీవికి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా చిరు వాటికి తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ వచ్చారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ చిరంజీవిని ప్రశ్నిస్తూ.. పవన్ కళ్యాణ్ గారితో మల్టీ స్టార్ సినిమా ఎప్పుడు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మెగాస్టార్ సమాధానం చెబుతూ.. తాను ఏ హీరోతో అయినా మల్టీ స్టార్ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు సినిమాలకు కమిట్ అయ్యారు. తన సినిమాలన్ని షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న తర్వాత మల్టీ స్టారర్ గురించి ఆలోచిస్తామని

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ తో మల్టీ స్టార్ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి చెప్పారంటే కచ్చితంగా అది జరుగుతుందని పవన్ సినిమాలన్నీ పూర్తి కావడానికి మరో రెండు సంవత్సరాల సమయం పడుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ మెగా కాంబోలో రాబోతున్న సినిమాకి సరైన కథ అందించే రచయిత వీరిని డైరెక్ట్ చేయబోయే ఆ దమ్మున్న డైరెక్టర్ ఎవరు? ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus