ఆ సూపర్ హిట్ చిత్రం వల్ల చిరు బాధ పడిన క్షణం…!

  • December 6, 2020 / 06:56 AM IST

సాధారణంగా ఓ చిత్రం సూపర్ హిట్ అయినప్పుడు ఏ హీరో అయినా ఎగిరిగంతేస్తూ ఉంటారు. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం వల్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంటారు. అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం తన సినిమా సూపర్ హిట్ అని తెలిసినా బాధ పడ్డారట. ఎందుకలా? అసలు ఏ సినిమా అది..? హిట్ సినిమాకి మెగాస్టార్ ఎందుకు అంత బాధ పడినట్టు అని మీకు డౌట్ రావచ్చు.

మేటర్ లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈవివి సత్యనారాయణ డైరెక్షన్లో అల్లుడా మజాకా.. అనే చిత్రం చేశారు. ఆ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయి అని మహిళా సంఘాల వారు పెద్ద రచ్చ చేశారు. దీంతో కాంట్రవర్సీ ఎక్కువైపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ మెగాస్టార్ సినీ కెరీర్లో అంతలా కాంట్రవర్సీ ఎదుర్కోవడం అదే మొదటిసారి. అందుకే ఆ చిత్రం రచయితతో మెగాస్టార్ హర్ట్ అయినట్టు తెలిపి బాధపడినట్టు కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రంభ హీరోయిన్లుగా నటించగా .. శ్రీకాంత్ భార్య ఊహ.. మెగాస్టార్ చెల్లెలు పాత్రలో కనిపించారు. బ్రహ్మానందం కామెడీ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus