Chiranjeevi: మరోసారి గొప్ప మనసు చాటుకున్న చిరు..!

మెగాస్టార్ చిరంజీవి.. ఎక్కడో మొగల్తూరులో ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే సినిమాల పై ఉన్న వ్యామోహంతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన నైపుణ్యంతో అతి తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకున్న చిరు… 30 ఏళ్ళకు పైగా తన స్థానాన్ని కాపాడుకోవడం విశేషం. చిరంజీవి స్టార్ గా ఎదిగిన తర్వాత ఆయన అభిమానుల పట్ల కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

Click Here To Watch

కేవలం ఫోటోలు దిగడానికి, థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు కట్టడానికి మాత్రమే ఆయన అభిమానుల్ని అంకితం చేయలేదు. ప్రతీ ఒక్కరిలో సామాజిక స్పృహ లేపి.. ఎంతో మందికి రక్తదానం, నేత్రదానం చేసేలా ప్రేరేపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా నిలబడిన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి అనడంలో అతిశయోక్తి కాదు. ఇలాంటి లాయల్ ఫ్యాన్స్ ఉండడం వలనే ఆయన సినీ పరిశ్రమలో తిరుగులేని రారాజుగా ఓ వెలుగొందుతున్నారు. ఇదిలా ఉండగా.. చిరంజీవికి ఉన్న లాయల్ ఫ్యాన్స్ లో శ్రీకాకుళం జిల్లా రాజాం పరిధిలోని కొండంపేటకు చెందిన కొండల రావు కూడా ఒకరు.

30 ఏళ్లుగా ఆయన టీ స్టాల్ నడుపుకుంటూ … చిరంజీవి యువత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఫిబ్రవరి 10న తన కూతురి పెళ్ళి సందర్భంగా కొండలరావు… తన కూతురు నీలవేణి పెళ్లికార్డు పై చిరంజీవి దంపతులు, నాగేంద్ర బాబు, పవన్ కల్యాణ్‌ చిత్రాలను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇది కాస్త చిరు వరకు వెళ్లడంతో… ఆయన వెంటనే కొండలరావు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకుని రూ.1 లక్ష రూపాయలు జమ చేశారు.

అంతేకాదు కొండలరావు కూతురికి కూడా బెస్ట్ విషెస్ చెప్పారు. ఇక చిరంజీవి యువత కూడా రూ.1 లక్ష కలెక్ట్ చేసి కొండలరావుకి అందజేశారు. ఈ క్రమంలో కొండలరావు ఎమోషనల్ అయ్యి చిరంజీవితో పాటు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus