Chiranjeevi, Devaraj: కష్టం అంటే స్పందించే మెగాస్టార్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు..!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటే పసి పిల్లల దగ్గరినుండి పండు ముసలి వరకు అంతా ఆనంద పడతారు. తెరమీద ఆయన కనిపించినా, డ్యాన్స్ చేసినా, డైలాగ్ చెప్పినా ఈలలు, గోలలే.. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానాన్ని మకుటంలేని మహారాజుగా అధిష్టించిన, ఆ సింహాసనానికి అలంకరణ చేసిన చరిత్ర చిరుది..నటుడిగానే కాక సామాజిక సేవలోనూ స్టార్ అనిపించుకున్నారాయన.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడారు, ఏనాడూ ఆయన చేసిన మంచి గురించి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేయలేదాయన..

కరోనా కష్టకాలంలో పూట గడవక ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు ఆదుకోవడానికి సీసీసీ (చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్) స్థాపించి చాాలా సాయం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. స్వర్గీయ దర్శకరత్న దాసరి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరునే కావాలంటూ ఎప్పటినుండో అభ్యర్థనలు వస్తున్నా సున్నితంగా తిరస్కరించారంటే అది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. కష్టం అనే మాట వినిపిస్తే ఆపన్న హస్తం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటారాయన.

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఒకప్పటి కెమెరామెన్ దేవరాజ్‌కు మెగాస్టార్‌ సహాయం చేశారు. ఒకప్పుడు తన సినిమాలకు పని చేసిన దేవరాజ్‌ పరిస్థితి చూసి చలించిపోయిన చిరు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. దేవరాజ్‌.. చిరంజీవి నటించిన ‘నాగు’, ‘పులి.. బెబ్బులి’, ‘రాణి కాసుల రంగమ్మ’ వంటి సినిమాలకు ఛాయాగ్రహుడిగా పని చేశారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తన సినిమాలకు పని చేసిన వ్యక్తికి చిరు సహాయం అందించటం పట్ల ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మెగాస్టార్ మంచి మనసు గురించి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తో 2023లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవి వరుసగా క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో పెడుతున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus