ఎవరినీ చేయి చాచి అడగలేదు.. చిరంజీవి హీరోయిన్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో నటించి రిమీ సేన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగులో అందరివాడు (Andarivaadu) సినిమాలో యంగ్ చిరంజీవికి (Chiranjeevi) జోడీగా నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో ధూమ్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ హంగామాతో పాటు మరికొన్ని క్రేజీ సినిమాలలో నటించి ఈ నటి మెప్పించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రిమీ సేన్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. నేను నటించిన రోల్ కు సినిమాలలో ప్రాధాన్యత ఉండేది కాదని ఆమె అన్నారు.

నాది కేవలం ఫర్నీచర్ రోల్ అని ఆమె పేర్కొన్నారు. హంగామా, జానీ, గద్దర్ సినిమాలలో మాత్రమే మంచి పాత్రలు చేశానని రిమీ సేన్ వెల్లడించారు. ఆ తర్వాత అలాంటి రోల్స్ వస్తే బాగుంటుందని కోరుకున్నాను కానీ వర్కౌట్ కాలేదని ఆమె చెప్పుకొచ్చారు. అక్షయ్ కుమార్ (Akshay Kumar) , అజయ్ దేవగణ్ (Ajay Devgn) లతో పని చేసినా ఇండస్ట్రీలో ఎవరితో కనెక్ట్ కాలేదని రిమీ సేన్ తెలిపారు. నేను సహాయం కోసం, మూవీ ఆఫర్ల కోసం ఎవరినీ చేయి చాచి అడగలేదని ఆమె పేర్కొన్నారు.

సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ అనేది నెక్స్ట్ అని మొదట మీరు వ్యక్తులను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలని రిమీ సేన్ చెప్పుకొచ్చారు. లేకపోతే ఏ పని జరగదని లేదంటే మీ ప్రతిభ స్టోర్ రూమ్ కు పరిమితం కావాల్సిందేనని ఆమె అన్నారు. సినిమా ఇండస్ట్రీలో అందరినీ అడుక్కోవడం, పీఆర్ చేయడం నాకు రాదని రిమీ సేన్ తెలిపారు.

కొన్ని రోజుల క్రితం రిమీ సేన్ తన ఫ్రెండ్ రౌనక్ జతిన్ వ్యాస్ వల్ల 4 కోట్ల రూపాయలు మోసపోయాననిపేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతోందని ఆమె వెల్లడించారు. రిమీ సేన్ రాబోయే రోజుల్లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. రిమీ సేన్ కు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus