Chiranjeevi: చిరంజీవి నోట కాస్ట్‌ కంట్రోల్‌ మాట.. ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా?

ఇండస్ట్రీని లీడ్‌ చేయండి అంటే.. నేనెవరిని లీడ్‌ చేయడానికి.. నేను అందరిలా ఇండస్ట్రీ బిడ్డనే అంటుంటారు చిరంజీవి. దాని వెనుక కారణం ఆయన నాయకత్వం వహిస్తుంటే ఓర్వలేక కొంతమంది చేసిన కామెంట్సే అని అంటారు. పెద్ద పంచాయితీ అయ్యాకనే సమస్యలు ఏవైనా వచ్చిన ఆయన పరిశ్రమకు నేతృత్వం వహించడం మానేశారు. అయితే ఆయన పరిశ్రమకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ దూరంగా ఉండటం లేదు. వీలు కుదిరినప్పుడు, అవసరం వచ్చినప్పుడల్లా తన అనుభవంతో కొన్ని సలహాలు, సూచనలు చేస్తూనే ఉన్నారు.

Chiranjeevi

తాజాగా ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కూడా ఇలా ఓ ఆసక్తికరమైన చర్చకు తెర తీశారు. నిజానికి ఈ అంశం గురించి చాలా ఏళ్లుగా పరిశ్రమలో చర్చ జరుగుతూనే ఉంది. అయితే హీరోలెవరూ దీని గురించి బహిరంగంగా మాట్లాడింది లేదు. అదే కాస్ట్ కంట్రోల్‌. సినిమా నిర్మాణంలో వ్యయ నియంత్రణ చేయాలి అనేది చాలా మంది పరిశ్రమ పెద్దలు చెబుతూనే ఉన్నారు. దీని కోసం ఓసారి అందరూ కూర్చుని మాట్లాడారు కూడా. కానీ ఏదీ కుదర్లేదు.

ఇప్పుడు ఈ విషయం గురించి చిరంజీవి తన కొత్త సినిమాను ఉదహరిస్తూ చెప్పారు. ఈ సినిమా ఓ విధంగా విజయం సాధించింది.. ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్‌లో అనుకున్న దాని కంటే తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేయగలిగాం. ఇలా పక్కాగా ప్లానింగ్‌ చేసుకొని సినిమాలు తెరకెక్కిస్తే ఖర్చు చాలావరకు తగ్గుతుంది అని చెప్పారు చిరు. ఆ తర్వాత సినిమా ఛాయాగ్రాహకుడు సమీర్‌ రెడ్డి గురించి మాట్లాడుతూ.. షాట్‌కి షాట్‌కి మధ్య ఆయన ఎక్కువ టైమ్‌ తీసుకోరని.. ఇలా పని చేస్తే పరిశ్రమ బాగుంటుంది అని చెప్పారు.

సినిమా ప్లానింగ్, ప్రాసెస్‌ గురించి చిరు చెప్పిన ఆ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మరి ఆయన మాటలను పరిశ్రమ ఆదర్శంగా తీసుకొని సినిమా మేకింగ్‌ కాస్ట్‌ కంట్రోల్‌ చేస్తుందా అనేది చూడాలి. ఒకవేళ ఆ పని చేస్తే చాలావరకు సినిమా విషయంలో నిర్మాత సేఫ్‌ అవుతారు అని చెప్పొచ్చు.

డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus