Chiranjeevi: డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

చిరంజీవి సినిమాల్లో రీసెంట్‌ టైమ్స్‌లో రిఫ్రెషింగ్‌గా అనిపించిన మ్యూజిక్‌ ఏదైనా ఉందా అంటే.. అది కచ్చితంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పాటలే. భీమ్స్‌ సిసిరోలియో తనలోని ఫ్యాన్‌ బాయ్‌ని బయటకు తీసి ఆ పాటలకు మ్యూజిక్‌ ఇచ్చారు. రెగ్యులర్‌గా చిరంజీవి యాక్షన్‌ సినిమలకు భిన్నంగా ఈ సినిమా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో చేయగా.. పాటలు కొత్తగా అనిపించేలా తనకు అలవాటైన భీమ్స్‌ సిసిరోలియోతో మ్యూజిక్‌ చేయించుకున్నారు అనిల్‌ రావిపూడి. ఈ మ్యూజిక్‌ గురించి చిరంజీవి ఇటీవల గొప్పగా చెప్పుకొచ్చారు కూడా.

Chiranjeevi

‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ భీమ్స్‌ పనితనం గురించి చెప్పారు. చెవులకు ఎంతో శ్రావ్యంగా ఆ సంగీతం అనిపించిందని.. అలనాటి విజయ వారి సినిమాల్లో సంగీతంలా ఆ పాటలు హాయిగా అనిపించాయని కూడా మెచ్చుకున్నారు. తనకు అంతటి సంగీతం అందించిన భీమ్స్‌ని తెగ పొగిడేశారు కూడా. అయితే ఈ క్రమంలో ఆయన కొన్ని సెటైర్లు వేశారు.

సాధారణంగా చిరంజీవి ఇలాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడు పరిశ్రమలో జరుగుతున్న అంశాల గురించి అన్యాపదేశంగా కొన్ని సెటైర్లు వేస్తుంటారు. ఈసారి ఆ పని సంగీత దర్శకత్వం మీద చేసినట్లున్నారు. మ్యూజిక్‌ అంటే కీబోర్డ్, డ్రమ్స్‌ బాదేయడం కాకుండా ఈ సినిమా సంగీతంలా ఉండాలి అనేలా మాట్లాడారు. దీంతో చిరు సెటైర్లు ఎవరి మీద అనే చర్చ మొదలైంది. ఇండస్ట్రీలో కీబోర్డ్‌, డ్రమ్స్‌ బాదేస్తారు అనే పేరు ఓ సంగీత దర్శకుడి మీద ఉంది. ఓ సినిమాలో ఆయన మీద ఆయనే సెటైర్‌ వేసుకున్నారు కూడా.

ఆ సంగీత దర్శకుడు చిరంజీవితో ఓ సినిమా కూడా చేశారు. ఇప్పుడు చిరంజీవి ఆ సంగీత దర్శకుడినే అన్నారా? లేక ఏదో మాట వరుసకి అన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల వచ్చిన ఓ అగ్ర హీరో సినిమా విషయంలో డ్రమ్స్‌ ఓవర్‌గా వాడి చేసిన శబ్దాలు ఇబ్బంది పెట్టాయనే విమర్శలూ మనం విన్నాం. ఆ సినిమా సంగీత దర్శకుడూ ఆయనే.

అనిల్‌ రావిపూడి పరువు చిరంజీవి తీసేయబోయారా? నయన్‌ విషయంలో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus