Varun, Lavanya: వరుణ్ పెళ్లి చిరంజీవి తల్లి దూరం.. కారణమిదే..!

మెగా హీరో వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 1న ఈ జంట ఒక్కటి కానుంది. ఇప్పటికే మెగా -అల్లు కుటుంబ సభ్యుల్లో కొందరు ఇటలీ చేరుకున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం రేపు (సోమవారం) ఇటలీ బయల్దేరుతోంది. పెళ్లి తర్వాత ఇటలీ నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్‌లో నవంబర్‌ 5న రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే, ఈ వివాహానికి చిరంజీవి తల్లి అంజనా దేవి హాజరు కావటం లేదని సమాచారం.

ఇక ఇప్పటికే మెగా ఇంట మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడకలను అదరగొట్టిన మెగా హీరోలు..పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అందరికంటే ముందుగా రామ్‌ చరణ్‌-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో వెళ్లాడు.

ఇలా రామ్‌ చరణ్‌, బన్నీ ఇద్దరూ వరుణ్‌ పెళ్లి ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు (సోమవారం) మెగా-అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ ఇటలీ వెళ్లనున్నట్లు సమాచారం. అయితే, మెగాఫ్యామిలీలో ప్రధానమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి మనవడి పెళ్లికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య రిత్యా జర్నీ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించడంతో ఆమె హైదరాబాద్ లోనే ఉంటారని సమాచారం.

దీంతో (Varun, Lavanya) వరుణ్‌- లావణ్యల పెళ్లిని ఇంటి నుంచే వీడియోలో చూసే విధంగా చిరంజీవి ప్లాన్‌ చేశారని సమాచారం. ఇక, ఇటలీలో పెళ్లి వేడుకలు పూర్తయిన తరువాత హైదరాబాద్ కేంద్రంగా జరిగే రిసెప్షన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus