Chiranjeevi: షూటింగ్ స్టార్ట్ చేసాక మెగాస్టార్ అప్సెట్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమా తీస్తున్నారు. మెగాస్టార్ ఇందులో ఒక మాజీ నక్సలైట్ గా కనిపంచనున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే దీని తరువాత అతి త్వరలో తన నెక్స్ట్ సినిమాని కూడా మొదలెట్టనున్నారు మెగాస్టార్. మెగాసూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్న లూసిఫర్ తెలుగు రీమేక్ షూట్ లో త్వరలో మెగాస్టార్ జాయిన్ అవ్వనున్నారు.

మోహన్ రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ సిద్ధం చేసిన మోహన్ రాజా, కొన్ని యాక్షన్ సీన్స్ ని ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో డిజైన్ చేశారట. అయితే ఒరిజినల్ వర్షన్ లూసిఫర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ ఆకట్టుకున్నాయని, కానీ ఇవి అంతగా అలరించేలా లేవని, అందువలన ఫైట్ మాస్టర్స్ తో మరొక్కసారి చర్చించి మరింత క్రియేటివ్ గా వాటిని డిజైన్ చేయమని మోహన్ రాజాకి మెగాస్టార్ సూచన చేశారట.

నిజానికి తన సినిమాల్లో ప్రతి విషయమై ఎంతో శ్రద్ధ తీసుకునే మెగాస్టార్ కు ఉన్న అనుభవం తనకు తెలుసనీ, తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిని మరింత జాగ్రత్తగా డిజైన్ చేస్తానని మోహన్ అన్నారట. మొత్తంగా అందరిలో మంచి క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న లూసిఫర్ తెలుగు రీమేక్ నుండి నేడు సాయంత్రం అఫీషియల్ అప్ డేట్ రానుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus