Chiranjeevi: ఫస్ట్‌ లవ్‌ గురించి చెప్పిన చిరంజీవి!

చిరంజీవి జీవితం అభిమానులకు తెరిచిన పుస్తకం అంటూ ఉంటారు. ఆయన నటుడు అయినప్పటి నుండి అన్ని రకాల విషయాలు అభిమానులకు ఏదో విధంగా తెలుస్తూనే ఉన్నాయి. లేదంటే చిరంజీవి చెబుతూ ఉంటారు. అయితే ఆయన కొణిదెల శివ శంకర్‌ వరప్రసాద్‌గా ఉన్నప్పుడు జరిగిన విషయాలు, చేసిన చిలిపి పనులు గురించి మాత్రం అభిమానులకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఒకటీ రెండు చిరంజీవి ఎప్పుడైనా చెబితే తెలిసి ఉంటుంది. అలా సుమారు 12 ఏళ్ల వయసులో చిరంజీవి గురించి ఆయనే చెప్పారు.

ఆమిర్‌ ఖాన్‌ కథానాయకుడిగా, నాగచైతన్య ముఖ్య పాత్రధారిగా తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. ఈ సినిమాను తెలుగలో అదే పేరుతో చిరంజీవి సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ ద్వారా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారని సమాచారం. దీంతో ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, ఆమిర్ ఖాన్‌, నాగచైతన్యను నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. కొన్ని రోజుల క్రితం షూట్‌ చేసిన ఈ ఇంటర్వ్యూను త్వరలో స్టార్‌ మాలో టెలీకాస్ట్‌ చేస్తారు.

ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోను స్టార్‌ మా విడుదల చేసింది. అందులోని స్టఫ్‌ నచ్చిన అభిమానులు ఆ వీడియోను వైరల్‌ చేస్తున్నారు. అంతగా ఆకర్షించే అంశం ఏంటి అంటారా? ఒకటి కాదు చాలానే ఉన్నాయి. చిరంజీవి తొలి ప్రేమ, ఆమిర్‌ ఆన్‌సీన్‌ పిక్స్‌, చిరు – ఆమిర్‌ బ్రొమాన్స్‌ ఇలాంటివి చాలానే ఉన్నాయి. అందులో చిరంజీవి తొలి ప్రేమ గురించి ఇప్పుడు చూద్దాం. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’లో ఆమిర్‌ ఖాన్‌ పదేళ్ల వయసులోనే ప్రేమలో పడతాడు. మరి నిజ జీవితంలో అనే ప్రశ్న ఇంటర్వ్యూలో చర్చకు వచ్చింది.

ఈ ప్రశ్నకు చిరంజీవి ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. ‘మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు?’ అని చిరంజీవిని ఆమిర్ ఖాన్ అడిగాడు. ‘గుర్తు చేసుకోనివ్వండి’ అంటూ నవ్వేసిన చిరంజీవి… ‘‘ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మా మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆ అమ్మాయి సైకిల్ తొక్కుతుంటే ఎలా తొక్కుతుందో అని వెనక్కి తిరిగి చూసేవాడిని. అప్పుడు ముందుకి చూడు అని నా ముఖాన్ని తిప్పేది’’ అంటూ చిరు నాటి రోజులు గుర్తు చేసుకున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus