మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వల్ల మెగా, మంచు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్నికల సమయంలో చిరంజీవి, ప్రకాష్ రాజ్ రెండు వర్గాలుగా విడిపోయారనే కామెంట్లు వినిపించాయి. నాగబాబు సైతం ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు మంచు విష్ణు చిరంజీవి తనను పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా చిరంజీవి మోహన్ బాబుకు కాల్ చేసి మాట్లాడారని సమాచారం.
ఆ కాల్ లో చిరంజీవి తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదని చెప్పినట్టు తెలుస్తోంది. తన పేరు ఏ కారణం లేకుండా బయటకు వచ్చిందని చిరంజీవి మోహన్ బాబుకు చెప్పినట్టు సమాచారం. అందరూ కలిసికట్టుగా ఉండటమే తన కోరిక అని మోహన్ బాబుకు చిరంజీవి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కాల్ విషయంలో మోహన్ బాబు సైతం స్నేహపూర్వకంగా స్పందించారని సమాచారం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తైనా ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి ప్రజలలో, పరిశ్రమలో జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు చిరంజీవి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే సమస్యకు సర్జరీ చేయించుకున్నారు. దాదాపు 15 రోజులు చిరంజీవి విశ్రాంతి తీసుకోనున్నారు. గాడ్ ఫాదర్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిరంజీవి నవంబర్ 1వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. చిరంజీవి ఈ సినిమాతో పాటు భోళా శంకర్ సినిమాలో, బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!