ఆ పాత్రలో నాగ్ విశ్వరూపం చూపించాడు – చిరు!!!

టాలీవుడ్ లో టాప్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్, అక్కినేని ఇద్దరూ….టాలీవుడ్ కి రెండు కళ్ళు లాగా వెలిగారు…అయితే అదే క్రమంలో వారి తర్వాత వారి వారసులు టాలీవుడ్ లో టాప్ హీరోలుగా చక్రం తిప్పుతున్నారు…నందమూరి నట సింహం గా బాలయ్య ఇండస్ట్రీలో టాప్ హీరోగా, ఎదురులేని హీరోగా చక్రం తిప్పుతుంటే….మరోపక్క నాగ్ సైతం మంచి హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు…ఇదిలా ఉంటే…మాస్, క్లాస్ సినిమాలతో మెప్పించిన నాగార్జున భక్తిరస చిత్రాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు…..తాజాగా అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి ప్రేక్షకుల్ని ఎంత రంజింపజేసాయో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో హాథీరామ్‌ బాబా ఇతివృత్తంతో రూపొందిన మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది…. అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేసిన ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటించగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది.

జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఇదంతా మరో ఎత్తు అయితే…తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… “ఓం న‌మో వేంక‌టేశాయ” సినిమా చూడ‌ట‌మే వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. భ‌క్తి పార‌వ‌శ్యాలు పెల్లుబుకుతాయి. సెకండాఫ్ హృద్యంగా ఉండ‌ట‌మే కాదు, సెకండాఫ్ చూస్తుంటే తనకు తెలియకుండానే కళ్లు చెమ్మగిల్లాయని అన్నారు.  ప్రతి స‌న్నివేశం అద్భుతంగా ఉంది. సినిమా చూడ‌టం భ‌క్తితో కూడిన ప్ర‌యాణం చేసిన‌ట్టు అనిపించింది.  ఏది ఏమైనా ఇలాంటి భక్తిరస చిత్రాలు నాగార్జునకే చెల్లుతాయి..అందుకే ఆయన గ్రేట్ అన్నారు. మొత్తంగా చూసుకుంటే నాగ్ చిరు మధ్య ఉన్న స్నేహ బాంధవ్యం మరోసారి రుజువుఅయ్యింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus