అమితాబ్ కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్న చిరు.!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని తెలుగు సినిమాలో నటింపచేయించాలని అనేక మంది ప్రయత్నించారు. కానీ కుదరలేదు. అక్కినేని నాగార్జునతో ఉన్న పరిచయంతో మనం సినిమాలో కొన్ని క్షణాలు కనిపించారు. కానీ తొలిసారిగా తెలుగులో “సైరా” సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవికి గురువుగారి పాత్రలో కనిపించనున్నారు. బిగ్ బీ ఉన్న సన్నివేశాల షూటింగ్ రెండు రోజుల క్రితం పూర్తి అయింది. ఆ షూటింగ్ కి సంబంధించిన లుక్స్ కూడా బిగ్ బీ ట్విట్టర్లో రిలీజ్ చేశారు. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవమని ట్వీట్ చేశారు. అయితే ఈ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చిన అమితాబ్ బచ్చన్ కి చిరంజీవి రచ్చ మర్యాదలు చేసినట్లు తెలిసింది.

బిగ్‌బీ స్టే అయిన హోటల్ నుంచి షూటింగ్ లొకేషన్‌కు వచ్చేందుకు చిరు తన రోల్స్ రాయ్స్ కారును పంపించినట్టు సమాచారం. రెండు రోజుల పాటు ఆ కారు అమితాబ్‌తోనే ఉందంట. అమితాబ్‌కు సెక్యూరిటీని కూడా కట్టుదిట్టం చేశారు. అమితాబ్ ని ఇతర సినీ ప్రముఖులు కలిసి డిస్ట్రబ్ చేస్తారేమోనని.. ఎవరిని కలవనివ్వలేదు. ఇలా ఒక రారాజుకి మర్యాదలు చేసినట్లు అమితాబ్ కి చేసి తిరిగి ముంబయి కి పంపించారు. మరో సన్నివేశంలో అమితాబ్ నటించాల్సి ఉంది. ఆ సీన్ అడవుల్లో చిత్రీకరించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus