Chiranjeevi Pushes Fan: ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫీ… మొన్న నాగార్జున.. ఇప్పుడు చిరంజీవి.. ఈసారి ఏమైంది?

చూసిందంతా నిజం కాదు.. అక్కడ జరిగింది ఇదేనా.. అలా ఎలా తోసేస్తాడు.. అడిగింది సెల్ఫీనే కదా.. మొన్న నాగ్‌కి (Nagarjuna) ఒకలా అన్నారు.. ఇప్పుడు చిరంజీవికి (Chiranjeevi) ఇలా అంటున్నారా? గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న, కనిపిస్తున్న చర్చ ఇదే. దీని అంతంటికీ కారణం ఓ వీడియో. ఓ ఎయిర్‌పోర్టులో చిరంజీవి నడుచుకుంటూ వెళ్తుంటే.. పక్క నుండి ఓ కుర్రాడు వచ్చి సెల్ఫీ అడగడం. అయితే ఆయనకు సెల్ఫీ ఇవ్వకుండా పక్కకు తోసేశారు చిరంజీవి అనేది ఆ వీడియో సారాంశం.

అయితే, ఇది జరిగి చాలా రోజులైంది. ఎందుకంటే చిరంజీవి పారిస్ ఒలింపిక్స్‌ చూడానికి వెళ్లారు. తాజాగా స్వదేశానికి వచ్చేశారు కూడా. అయితే ఈ వీడియో వెళ్లినప్పుడు తీసిందా? లేక వచ్చేటప్పుడు తీసిందా అనేది తెలియదు. ఈ వీడియో ఇలా వైరల్‌ అయిందో లేదో వెంటనే ట్రోలర్స్‌ యాక్టివ్‌ అయిపోయారు. అలా ఎలా చేస్తారు అని కొందరు అంటుంటే.. నాగార్జునకు ఒక న్యాయం, చిరంజీవికి ఇంకో న్యాయమా అని మరికొందరు అంటున్నారు.

అయితే, ఆ వీడియో కింద చూస్తే కామెంట్స్‌లో చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆ వీడియో ఎడిటెడ్‌ అని, చిరంజీవి అలా ఎప్పుడూ చేయలేదు అని అంటున్నారు. మరికొందరు అయితే ఫోన్‌ తీసుకొని విసిరేసే హీరోలున్నారేమో కానీ.. మా హీరో అలా కాదు అని కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొంతమంది అయితే అయితే ఇది ఎడిటెడ్‌ వీడియో అని కూడా కామెంట్లు చేస్తున్నారు.

సెల్ఫీ అడిగే ముందు క్లిప్‌.. సెల్ఫీ ఇచ్చిన తర్వాతి క్లిప్‌ కలిపి ఒక వీడియోగా చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి కావాలని ట్రోల్‌ చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరిగింది అనేది చిరంజీవి కానీ, ఆయన టీమ్‌ కానీ చెప్పాలి. అప్పుడు చిరంజీవి తోసేశారా? లేక టైమ్‌ అవుతుంది బయటకు వెళ్లడానికి అలా చేశారా? లేక అసలు సెల్ఫీ ఇచ్చాక ఇదంతా జరిగిందా అనేది తేలుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus