OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ సినిమా ఈరోజు అనగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమాకి మొదటి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలని 10 ఏళ్ళ నుండి తహతహలాడుతున్నారో.. అలా చూపించాడని అంతా చెప్పుకుంటున్నారు. ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అంటున్నారు.

OG

ఓవరాల్ గా ‘ఓజి’ కి ఆశించినట్లే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ‘హరిహర వీరమల్లు’ తో డిజప్పాయింట్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ‘ఓజి’ తో సంతృప్తి చెందారు అనే అనుకోవాలి. సో బాక్సాఫీస్ వద్ద ‘ఓజి’ సినిమా ఓ రేంజ్లో గర్జించడం ఖాయమనే చెప్పాలి.

ఇక ‘ఓజి’ రెస్పాన్స్ చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా ఆనందం వ్యక్తం చేశారు. ‘ఓజి’ గురించి స్పెషల్ గా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “కళ్యాణ్ బాబు నిన్ను ఓజాస్ గంభీర అలియాస్ ‘ఓజి’గా చూడటం అనేది అభిమానులకు మాత్రమే కాదు నాకు కూడా పండుగలా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు సుజిత్, నిర్మాత దానయ్య, సంగీత దర్శకుడు తమన్.. అలాగే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు హార్టీ కంగ్రాట్యులేషన్స్” అంటూ అభినందించారు.

చిరంజీవి ట్వీట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ దాన్ని వైరల్ చేస్తున్నారు. అయితే చిరంజీవి ట్వీట్ ను బట్టి..ఆయన ఇంకా ‘ఓజి’ సినిమా చూడలేదు అనిపిస్తుంది. చూసిన తర్వాత కూడా రివ్యూ పోస్ట్ చేసే అవకాశం ఉంది.

 ‘ఓజి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus