Chiranjeevi : సింగర్ స్మిత షోలో సందడి చేసిన చిరు… బాలయ్యకు హ్యాండ్ ఇచ్చినట్టేనా?

ప్రస్తుతం ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమ మొదటి సీజన్ ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. అయితే మొదటి సీజన్ కు మించి రెండవ సీజన్ ప్లాన్ చేశారు.ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ కార్యక్రమ రెండవ సీజన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మొదలు కాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ముగియనుంది.

అయితే ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకోవడంతో ఈ సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదని అర్థం అవుతోంది. ఇలా బాలయ్య షో కి దూరంగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి సింగర్ స్మిత నిర్వహించబోతున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రముఖ ఓటీటీ సమస్త సోనీ లివ్ లోప్రసారం చేయబోతున్నారు.

అయితే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి సందడి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలయ్య షో కి దూరంగా ఉన్నటువంటి చిరంజీవి స్మిత టాక్ షోలో పాల్గొనడంతో చిరంజీవి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి రారా అనే సందేహం కూడా అందరిలో తలెత్తుతుంది. సీజన్ 2 లో మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి మూడవ సీజన్ ప్రారంభించినప్పుడైనా చిరంజీవి వస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus