చిరు మాట రాజమౌళి వినివుంటే కాజల్ జీవితం ఏమయ్యేదో..!

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో సుదీర్ఘమైన కెరీర్ కలిగిన మోడరన్ హీరోయిన్స్ లో ఒకరు. కాజల్ ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 16ఏళ్ళు అవుతుంది. తెలుగులో మాత్రం ఆమె మొదటి చిత్రం లక్ష్మీ కళ్యాణం. 2007లో దర్శకుడు తేజా తెరకెక్కించిన ఈ మూవీలో హీరోగా కళ్యాణ్ రామ్ నటించారు. ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఐతే కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ మూవీ ఆమెకు ఓ మోస్తరు విజయాన్ని అందించింది.

ఆ తరువాత కాజల్ కి వరుసగా మూడు ప్లాప్ సినిమాలు ఎదురయ్యాయి. దానితో ఆమె కెరీర్ కి ఎండ్ కార్డు పడుతుంది అనుకుంటున్న సమయంలో దర్శకుడు రాజమౌళి మగధీర చిత్రం కోసం తీసుకున్నాడు. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ సినిమా విజయం తరువాత కాజల్ కెరీర్ హిట్ ట్రాక్ లోకి వచ్చింది. ఆ తరువాత ఆమె చేసిన డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్ మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఐతే కాజల్ కి బ్రేక్ ఇచ్చిన మగధీర మూవీకి హీరోయిన్ గా కాజల్ వద్దని చిరంజీవి అన్నారట.

వరుస ప్లాప్స్ లో ఉన్న కాజల్ కాకుండా వేరే హీరోయిన్ ని తీసుకుందాం అని చిరంజీవి, రాజమౌళికి చెప్పారట. దానికి రాజమౌళి కాజల్ ని మిత్రవింద గెటప్ లో రెడీ చేసి చిరుకి చూపించారట. అప్పుడు కాజల్ ని చూసిన చిరు, రాజమౌళి డెసిషన్ కరెక్ట్ అని కాజల్ ని తీసుకోండి అనిచెప్పారట . ఒక వేళ రాజమౌళి చిరు మాటకు కట్టుబడి కాజల్ ని కాకుండా వేరొకరిని తీసుకోని ఉంటే ఆమె కెరీర్ బహుశా ఇన్నేళ్లు సాగేది కాదేమో.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus