మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళంలో సూపర్ హిట్ అయిన లుసీఫర్ చిత్రం రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్వీ.ప్రసాద్, రాంచరణ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నిజానికి లూసీఫర్ చిత్రం తెలుగులో కూడా డబ్ అయ్యింది. అయినప్పటికీ పలు మార్పులు చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావించి ఈ రీమేక్ కు శ్రీకారం చుట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగా… ఇందులో హీరోయిన్ ట్రాక్ ను కూడా జోడిస్తున్నట్టు సమాచారం.
చెప్పాలంటే ఒరిజినల్ లో హీరోయిన్ ఉండదు. కేవలం హీరో మరియు అతని సోదరి,తమ్ముళ్ళ మధ్య మాత్రమే జరిగే పొలిటికల్ కథ ఇది. అయితే తెలుగులో హీరోయిన్ ట్రాక్ ను యాడ్ చేస్తున్నారట. అంతేకాకుండా సినిమాలో పాటలకు కూడా స్కోప్ ఉండేలా కూడా చూస్తున్నారు అని తెలుస్తుంది. ఇక హీరోయిన్ గా ఇప్పటికే నయన్ తార ను సంప్రదించినట్లు టాక్. అయితే ఆమె 5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట.
సినిమాలో కేవలం 50నిమిషాల నిడివి గల పాత్ర కోసే ఆమె అంతలా డిమాండ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ సభ్యులు షాక్ కు గురయ్యారు అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వేరే హీరోయిన్ కోసం వారు అన్వేషిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.