నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి.. వీరిద్దరూ తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన స్టార్స్. ఎన్టీఆర్ నెంబర్ 1 హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో.. మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఆయనకు గట్టి పోటీని ఇచ్చారు. ఆ తర్వాత మాస్ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకొని చిరు కూడా నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఇక ఎన్టీఆర్ – చిరంజీవి కలిసి ‘తిరుగులేని మనిషి’ అనే సినిమాలో నటించిన సంగతి బహుశా ఎక్కువగా తెలిసుండదు.
ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. చిరంజీవి అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న రోజుల్లో ఎన్టీఆర్ ఓ విలువైన సలహా ఇచ్చారట. అదే ఇప్పుడు తన కుటుంబాన్ని కాపాడుతుంది అని చిరు తెలియజేశారు. గతంలో చిరంజీవి ఓ కారు కొనుగోలు చేయాలనుకుంటే.. ఎన్టీఆర్ వద్దన్నారట. ‘బ్రదర్ మీరు కార్లు వంటి వాటిపై ఎక్కువగా డబ్బులు పెట్టకండి. మనకి ఈ స్టార్ డం ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. కాబట్టి.. మీ సంపదని ముందుగా ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించండి.
ఆ తర్వాత స్థలాలు కొనుగోలు చేయడానికి ఉపయోగించండి. అంతేకాని కార్లు వంటి వాటి ఇనుపముక్కల పై ఎక్కువ పెట్టొద్దు’ అంటూ చిరుకి ఎన్టీఆర్ చెప్పారట. నిజంగా ఎన్టీఆర్ ఇచ్చిన ఆ విలువైన సలహా వల్లనే .. చిరు స్థలాలు కొనుగోలు చేశారట. ఇప్పుడు తన పారితోషికం కంటే తన కుటుంబాన్ని ఎక్కువగా కాపాడుతుంది ఆ స్థలాలే అని చిరంజీవి చెప్పుకొచ్చారు. పెద్దలు ఓ మాట చెప్పారు అంటే అది చాలా విలువైనదిగా భావించాలని కూడా చిరు (Chiranjeevi) సందేశం ఇచ్చారు.