Konda Polam Movie: వీళ్లు అలరిస్తారు.. మీరు ఆదరించాలి: చిరంజీవి

టాలీవుడ్‌లో సినిమా హీరోలు చెప్పే రివ్యూలు అంటే ఠక్కున ఇద్దరే గుర్తొస్తారు. అందుకే ఒకరు మెగాస్టార్‌ చిరంజీవి అయితే, రెండోది సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు. అక్టోబరు 8న విడుదలవుతున్న ‘కొండపొలం’ సినిమాను ఇటీవల చిరంజీవి వీక్షించారు. అనంతరం సినిమా గురించి, నటీనటుల ప్రదర్శన గురించి మాట్లాడారు. ఈ క్రమంలో క్రిష్‌ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. సినిమాకు రివార్డులతోపాటు, అవార్డులు రావాలని ఆకాంక్షించారు. ఇంకా ఆయనేమన్నారంటే…

జనరల్‌గా క్రిష్‌ సినిమా అనగా డిఫరెంట్‌ జోనర్స్‌లో ఉంటాయని మనం ఊహించేస్తుంటాం. థియేటర్లకు వచ్చినవాళ్లను ఈ సినిమా థ్రిల్‌ కలిగిస్తుంది. నేనైతే ‘కొండపొలం’ అనే పుస్తకం చదవలేదు. దాని గురించి నాకేమీ తెలియదు. ఒకసారి వైష్ణవ్‌తేజ్‌ వచ్చి ‘మామా ‘కొండపొలం’ అనే సినిమా క్రిష్‌ డైరక్షన్‌లో చేస్తున్నాను’ అని చెప్పాడు. దానికి నేను వెంటనే ‘వెంటనే చేయ్‌ అని చెప్పేశాను. స్క్రిప్ట్‌, కథ లాంటివి పట్టించుకోకుండా చేసేయ్‌ అని చెప్పాను. క్రిష్‌ దర్శకత్వం అంటే నీ కెరీర్‌లో ఓ వెరైటీ సినిమా వస్తుంది. నటనకు మంచి అవకాశం ఉన్న సినిమా అవుతుంది’ అని చెప్పాను. నేను చెప్పినట్లే సినిమా నేపథ్యం, యాంబియెన్స్‌, పాత్రల చిత్రణ చాలా డిఫరెంట్‌గా కనిపించాయి’’ అని చెప్పారు చిరంజీవి.

‘‘క్రిష్ సినిమాలు మొదట్నుంచి అన్నీ చూశాను. ఒక సినిమాకు, ఇంకో సినిమాకు అసలు సంబంధం లేదు. ‘కొండపొలం’ కూడా గత సినిమాల కంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇది చక్కటి, రస్టిక్‌ లవ్‌ స్టోరీ. మానవాళి… ఈ ప్రకృతిని ఎలా రక్షించుకోవాలో చెప్పిన కథాంశం ఇది. ఇలాంటి మెసేజ్‌తో పాటు, చక్కటి ప్రేమ కథను తీసుకొచ్చారు. రకుల్‌ ప్రీత్‌, వైష్ణవ్‌ చక్కగా నటించారు. నేనైతే బాగా ఎంజాయ్‌ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నిర్మాతలకు సినిమా మంచి వసూళ్లు అందించాలని కోరుకుటున్నాను’’ అని చిత్రబృందాన్ని ఆశీర్వదించారు చిరంజీవి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus