చిరంజీవి చిన్న కూతురు మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో ఒక అమ్మాయితో దిగిన ఫోటోను భరద్వాజ్ పోస్టు చేశాడు. దీంతో భరద్వాజ్ రెండో వివాహం చేసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భరద్వాజ్‌తో విడిపోయిన తరువాత శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది.
అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కళ్యాణ్‌ను 2016లో శ్రీజ పెళ్లి చేసుకుంది. భరద్వాజ్, శ్రీజ దంపతులకు ఒక పాప కూడా ఉంది. ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో పాప భరద్వాజ్ దగ్గరనే ఉంటుంది. తాజాగా శిరీష్ భరద్వాజ్ బిజెపి పార్టీలో చేరాడు.