బ్లాక్ బస్టర్ రీమేక్ అయినప్పటికీ ఎస్.పి.పరశురామ్ ఎందుకు ఆడలేదంటే..?

  • February 8, 2021 / 08:07 AM IST

అదేంటో ప్రేక్షకులు కొన్ని సినిమాలను థియేటర్లలో ఆదరించరు. కానీ టీవీల్లో చూసినప్పుడు మాత్రం సూపర్.. క్లాసిక్ అంటుంటారు. ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో ‘ఈ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందా?’ అంటూ డిస్కషన్లు పెడుతుంటారు. చాలా హీరోల సినిమాల గురించి ఇదే డిస్కషన్ జరుగుతుంటుంది. అండర్ రేటెడ్ అనే పదాన్ని కూడా ఎక్కువగా వాడుతుంటారు కొందరు నెటిజన్లు. అలా ఇటీవల కాలంలో ఎక్కువ రీమేక్ ల పై దృష్టి పెట్టిన మన మెగాస్టార్ చిరంజీవి గురించి ఎక్కువ డిస్కషన్లు నడుస్తున్నాయి. ‘లూసిఫర్’ ‘వేదాళం’ వంటి చిత్రాలను రీమేక్ చేస్తున్నారాయన.

అయితే గతంలో ఆయన చేసిన సూపర్ హిట్ రీమేక్ ఇక్కడ విజయం సాధించలేదు. అదే ‘ఎస్.పి.పరశురామ్. ‘వాల్టర్ వెట్రివేల్’ అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో కంటే ముందు హిందీలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. మినిమమ్ గ్యారెంటీ అనుకున్న ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు.. చిరంజీవి,శ్రీదేవి వంటి స్టార్లను ఎంపిక చేసుకున్నారు. రవిరాజా పినిశెట్టి దర్శకుడు. విశాల్ తండ్రి జి.కె.రెడ్డి నిర్మాత. ఇంకేముంది సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. ఫైనల్ గా ప్లాప్ గా మిగిలింది.

చిరు పాత్ర ఈ చిత్రంలో చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆయన నటన కూడా అప్పటి వరకూ ఆయన చేసిన సినిమాలకు మించి శ్రద్ద పెట్టి చేశారు. అదంతా వేస్ట్ అయిపోయిందనే చెప్పాలి. ప్రధానంగా హీరో తమ్ముడు(హరీష్) బ్లూ ఫిలిమ్స్ తీసే వ్యక్తిగా కనిపించడం అలాగే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ శ్రీదేవి కంటి చూపు లేని ఇల్లాలిగా కనిపించడం వంటివి మన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus