తమన్నాని అడ్డుపెట్టుకుని నయన్ పై చిరు సెటైర్లు..!

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా వచ్చిన ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మిగిలిన భాషల్లోనూ, ఓవర్సీస్ లో సినిమా పెర్ఫార్మన్స్ ను పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్ల విషయంలో హీరోయిన్ నయన తార హాజరుకాలేదు. ఈ విషయంలో నిర్మాత రాంచరణ్, చిరంజీవి ఎంత రిక్వెస్ట్ చేసినా ఆమె.. ‘నా పని అయిపోయిందండి.. నేను రాను’ అని చెప్పడంతో చరణ్, చిరు చాలా అప్సెట్ అయినట్టు తెలుస్తుంది. ఆమె గనుక ప్రమోషన్స్ కు హాజరైనట్లైతే తమిళంలో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చేవి అనడంలో సందేహం లేదు. ఈ విషయంలో చిరు తన బాధని ఇండైరెక్ట్ గా బయటపెట్టినట్టు.. తాజాగా సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీలో స్పష్టమైంది.

ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ… “ఈ చిత్రంలో తమన్నా చాలా అద్భుతంగా నటించి శభాష్ అనిపించింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ తరువాత అంత పేరొచ్చే క్యారక్టర్ తమన్నాదే అని చెప్పాలి. ఈ చిత్రం ప్రమోషన్ల విషయంలో ఎంతో శ్రద్ధ చూపించింది. ఆర్టిస్ట్ గా ‘నేను రాను.. నేను చేయలేనండి.. నా వరకూ నా బాధ్యత అయిపొయింది అని చెప్పేస్తే.. ‘ ఎవరూ తనకి ట్రబుల్ ఇవ్వరు. మరో హీరోయిన్(నయన తార) పార్టిసిపేషన్ లేకపోతే మేమేమి అనలేదు. కానీ తమన్నా ‘సైరా’ ని ఓన్ చేసుకుంది. నీ డెడికేషన్ కి.. చాలా థాంక్స్. అందరి హీరోయిన్లకి తమన్నా ఓ ఆదర్శం” అంటూ ఓ పక్క తమన్నాని పొంగుతూనే మరో పక్క నయన్ పై సెటైర్లు వేసాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus