టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ ఉంది. పండుగల సమయంలో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం సాధారణం అనే సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో చివరి ఎపిసోడ్ ఈ నెల 10వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరైన పార్ట్2 ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే అదే రోజు నిజం విత్ స్మిత షో కూడా సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ షో తొలి ఎపిసోడ్ లో చిరంజీవి కనిపించనున్నారు. తాజాగా ఫస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో రిలీజ్ కాగా ప్రోమోలో స్మిత అడిగిన ప్రశ్నలకు చిరంజీవి తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు. కాలేజ్ డేస్ లో ఫస్ట్ క్రష్ ఎవరని యాంకర్ అడగగా చిరంజీవి ఆ ప్రశ్నకు వెరైటీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు.
స్టార్ డమ్ అనేది కొంతమందికే అని ఆ స్టేజ్ కు వెళ్లాలంటే అవమానాలు, అనుమానాలు అంటూ స్మిత కామెంట్ చేయగా చిరంజీవి మాట్లాడుతూ జగిత్యాలలో నాకు పై నుంచి పూల వర్షంలా కురిసిందని కొంచెం ముందుకు వెళ్లగానే కోడిగుడ్లు వేసి కొట్టారని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. మళ్లీ ఒక వర ప్రసాద్ చిరంజీవి అయ్యే పరిస్థితి ఇండస్ట్రీలో ఉందంటారా అనే ప్రశ్నకు చిరంజీవి ఏమని సమాధానం ఇచ్చారో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు ఆగాల్సిందే.
ఓటీటీలలో చిరంజీవి, పవన్ ఎపిసోడ్ల మధ్య పోటీ ఉండనుండగా ఏ ఎపిసోడ్ కు ఏ రేంజ్ లో వ్యూస్ వస్తాయో చూడాల్సి ఉంది. సోనీ లివ్ ఓటీటీకి ఇతర ఓటీటీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ షో ద్వారా చిరంజీవి తన క్రష్ కు సంబంధించిన విషయాలతో పాటు ఇతర షాకింగ్ విషయాలను రివీల్ చేస్తారేమో చూడాలి. తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను చిరంజీవి ఈ షో ద్వారా వెల్లడించనున్నారని తెలుస్తోంది.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!