ఏ కుటుంబం నుండి రానంత మంది హీరోలు మెగా కుటుంబం నుండి వచ్చారు. తండ్రులు, కొడుకులు, మేనల్లుళ్ళు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు కూడా హీరో అయిపోవాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు ఇటీవలే రెండో వివాహం జరిగింది. తన అల్లుడిగా కల్యాణ్ ను ఎన్నుకున్నాడు చిరంజీవి. కళ్యాణ్ కూడా చూడడానికి బాగానే ఉంటాడు.
డానికి తోడు అతడు సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్లుగా వినికిడి. ఈ విషయమై చిరంజీవి దగ్గర ప్రస్తావించగా అల్లుడి ఆశలపై నీళ్ళు చల్లినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇలాంటి చర్చలు చేయొద్దని చెప్పడట చిరు. ముందుగా డాన్సులు, అలానే నటన నేర్చుకోవడానికి కాస్త సమయం పడుతుంది కదా అని చిరు అన్నాడట. ఇవన్నీ నేర్చుకోవడానికి కళ్యాణ్ కు కనీసం ఏడాది సమయం పడుతుంది. కాబట్టి చిన్నల్లుడి కోరిక అప్పుడే నెరవేరేలా లేదు.