మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓ పక్క ‘విశ్వంభర’ ని కంప్లీట్ చేస్తూనే.. మరోపక్క అనిల్ రావిపూడి (Anil RaviPudi) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘విశ్వంభర’ రిలీజ్ అయితే ప్రస్తుతానికి డౌట్ గానే ఉంది. అందుకు కారణాలు మేకర్స్ చెప్పకపోయినా.. చాలా వరకు తెలిసినవే. అది వి.ఎఫ్.ఎక్స్ తో కూడుకున్న సినిమా. దాని వర్క్ చాలా పెండింగ్ ఉంది. అందుకే 2025 సంక్రాంతికి అనుకున్న ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. మరోపక్క అనిల్ రావిపూడి మాత్రం బాస్ తో చేస్తున్న సినిమాని ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.
ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయాయి. చిరు కామెడీ టైమింగ్ ను ఈ మధ్య చాలా మిస్ అయ్యాం. అందుకే అనిల్ రావిపూడితో ఓ సినిమా చేసి ఆ లోటుని తీర్చాలని చిరు భావిస్తున్నారు. ‘ఈ సినిమా కథ పాతదే కానీ.. స్క్రీన్ ప్లే కొత్తగా ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని’ చిరు చెప్పకనే చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి ‘రఫ్పాడిస్తాం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. అలాగే ఈ సినిమాలో మాస్టర్ భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్.. అదేనండీ మన బుల్లిరాజు కూడా నటిస్తున్నాడట. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయంలో బుల్లిరాజు పాత్ర కీలక పాత్ర పోషించింది. అందుకే చిరు ఏరి కోరి మరీ బుల్లిరాజు పాత్రని పెట్టించుకున్నట్టు టాక్ నడుస్తుంది.
దర్శకుడు అనిల్ మొదట చిరుకి కథ చెప్పినప్పుడు బుల్లిరాజు పాత్ర లేదట. కానీ చిరు ప్రత్యేకంగా అనిల్ ని అడిగి మరీ బుల్లిరాజు పాత్ర పెట్టించుకున్నారట. అందుకోసం స్కూల్లో డ్రిల్ మాస్టర్ ట్రాక్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి.