తుది మెరుపులు దిద్దుకుంటున్న మెగాస్టార్ ‘సైరా’..!

‘మెగాస్టార్ 151’ వ చిత్రంగా ‘సైరా నరసింహ రెడ్డి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహరెడ్డి జీవిత ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ 250 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘సైరా’ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందట. ఈ తరుణంలో చిరంజీవి ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా గడుపుతున్నారట. అప్పుడే డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టేశారట.

ఇక విజువల్ ఎఫెక్ట్స్ పనులను కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇదిలా ఉండగా ఈ చిత్రం టీజర్ ను ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా కానీ.. లేదా మెగాస్టార్ పుట్టిన రోజు అయిన ఆగష్టు 22 న విడుదల చేసే అవకాశం ఉందట. ఇక సినిమాని అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు.అమితాబ్ బచ్చన్, విజ్జయి సేతుపతి, జగపతిబాబు, కిచ్చ సుదీప్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus