Chiranjeevi, Ram Charan: చిరంజీవి అలా ఆ ముచ్చట తీర్చుకుంటున్నారా?

  • July 8, 2022 / 11:44 AM IST

చిరంజీవి – రామ్‌చరణ్‌ కలసి ఓ సినిమా చేస్తే చూడాలని అభిమానులకు ఎప్పుడూ ఉంటుంది. గతంలో వారిద్దరూ తెరపై కనిపించినా.. మళ్లీ మళ్లీ కనిపించాలి అని కోరుకుంటుంటారు. అలా అనుకుంటున్న అభిమానుల కోసం మరోసారి ఇద్దరూ ఒకేసారి స్క్రీన్‌ కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈ క్రమంలో చిరంజీవి ముచ్చట కూడా తీరిపోతుంది అని చెబుతున్నారు. అదేంటి చిరు – చరణ్‌ కలసి కనిపించడం.. చిరంజీవి ముచ్చట తీరడం ఏంటి అనుకుంటున్నారా? ఈ విషయం తెలియాలంటే కాస్త రివైండ్‌ చేయాలి.

శంకర్‌ సినిమా కథలో చిరంజీవి ఇప్పటికే ఓసారి నటించారు. అదే ‘జెంటిల్‌మ్యాన్‌’ హిందీ వెర్షన్‌. మహేష్‌ భట్‌ దర్శకత్వంలో ఆ సినిమాను హిందీలోకి తెరకెక్కించారు. అయితే నేరుగా శంకర్‌ సినిమాలో చేద్దామని చిరంజీవి ఎప్పటి నుండో అనుకుంటున్నారు. కానీ కుదరడం లేదు. ఇప్పుడు చరణ్‌తో శంకర్‌ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో చిరంజీవి కీలక పాత్రలో నటిస్తారని వార్తలొస్తున్నాయి. సినిమాలో ముఖ్యమైన సమయంలో ఆ పాత్ర వస్తుందని చెబుతున్నారు. రామ్‌చరణ్‌ సినిమాలో చిరంజీవి అంటే ‘మగధీర’తో మొదలైంది.

అందులో ‘బంగారు కోడిపెట్ట..’ పాట తర్వాత చిరంజీవి కాసేపు కనిపించి వావ్‌ అనిపించాడు. ఆ తర్వాత ‘బ్రూస్‌లీ’లో చిరంజీవి కోసమే ఓ ఫైట్‌ కూడా పెట్టారు. తొలి సినిమా హిట్‌ కొట్టగా, రెండో సినిమా ఫట్‌మంది. ‘ఖైదీ నెం 150’లో కనిపించినా అది చిరంజీవి సినిమా. అయితే ‘ఆచార్య’లో ఫుల్‌ ప్లెడ్జ్‌ క్యారెక్టర్‌ చేశారు. ఇప్పుడు మరోసారి శంకర్‌ సినిమాలో నటిస్తారని టాక్‌. అయితే ఈ సారి చిరంజీవి పాత్ర కృతకంగా కాకుండా… పాత్ర కోసం చిరంజీవి నటిస్తారని అంటున్నారు.

కైరా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ రెండు ర‌కాల గెట‌ప్పుల్లో క‌నిపించ‌నున్నాడని టాక్‌. ఇప్పటికే ఓ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయిపోయింది. అందులో చరణ్‌ మీసం, గెడ్డం లేకుండా కనిపిస్తాడట. అయితే రెండో పాత్రలో గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో ఉంటాడట. ఆ లుక్‌ ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తారని సమాచారం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus