దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే ఆయన సినిమాల్లో హీరోలు కూడా చాలా ఎనర్జిటిక్ గా కూడా కనిపిస్తారు అని అర్థం చేసుకోవచ్చు. సీనియర్ హీరోలను అనిల్ కొత్తగా ప్రెజెంట్ చేస్తుంటారు. ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాల్లో వెంకీ (Venkatesh Daggubati) ఎంత ఎనర్జిటిక్ గా కనిపించారో చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన ఇంత ఉత్సాహంగా.. మరో దర్శకుడి సినిమాల్లో కనిపించింది లేదనే చెప్పాలి.
అనిల్ తో సినిమా అంటే వెంకీలో కూడా ఏదో ఒక తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది అనుకుంట. సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు అదే ఎనర్జీతో కనిపిస్తాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో అయితే ఆయన రెట్టింపు ఉత్సాహంతో పాట కూడా పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరుతో (Chiranjeevi) చేస్తున్న సినిమా విషయంలో కూడా అనిల్ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్న సినిమా ఇది.
చిరు మార్కెట్ వెంకీకి డబుల్ ఉంటుంది. సో కరెక్ట్ గా తీస్తే.. సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ని మించి కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే చిరు కూడా అనిల్ కి పూర్తిగా సరెండర్ అయిపోతున్నారు అని సమాచారం. ఇందులో భాగంగా ఈ సినిమాలో చిరు ఓ పాట పాడటానికి కూడా రెడీ అయ్యారట. భీమ్స్ (Bheems Ceciroleo) ఈ సినిమాకి కూడా సంగీతం అందించనున్నాడు. చిరు పాట పడటం కొత్తేమీ కాదు.
గతంలో ‘మాస్టర్’ (Master) సినిమాలో ‘తమ్ముడు తమ్ముడు’ అనే పాట పాడారు. తర్వాత ‘మృగరాజు’ (Mrugaraju) లో ‘చాయ్ చటుక్కున’ అనే పాట పాడారు. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ (Shankar Dada M.B.B.S) ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ ‘ఖైదీ నెంబర్ 150’ (Khaidi No. 150) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి సినిమాల్లో కూడా చిరు తన గాత్రంతో మెప్పించారు. ఇప్పుడు అనిల్ తో చేస్తున్న సినిమాలో ఫుల్ లెంగ్త్ సాంగ్ పడుతున్నట్టు స్పష్టమవుతుంది.