Chiranjeevi, Balayya Babu: దసరాకి చిరు సినిమాతో బాలయ్య సినిమా పోటీ !

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాక్సాఫీస్ బరిలో పోటీ పడిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ఈ సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అవుతున్నాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడేది. ఫ్యాన్ వార్స్ ఓ రేంజ్లో జరిగేవి.పోటీ విషయంలో చిరు- బాలయ్య కూడా సై అంటే సై అన్నట్టు ఉండేవారు. రాను రాను ఈ పోటీలు తగ్గిపోయాయి. పెద్ద సినిమాల నిర్మాతలు ఓ అండర్స్టాండింగ్ తో కొంత గ్యాప్ ఇచ్చి తమ సినిమాల విడుదలకు ప్లాన్ చేసుకుంటున్నారు.

అయినప్పటికీ పండుగల టైం లో పెద్ద సినిమాలు పోటీ పడటం మామూలు విషయం అయిపోయింది. ఆ టైం లో ఏ సినిమా రిలీజ్ అయినా జనాలు చూస్తారు. పండుగ ముగిసిన తర్వాత మాత్రం బాగున్న సినిమా నిలబడుతుంది. 2017 లో చాలా గ్యాప్ తర్వాత బాలయ్య-చిరంజీవి బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగారు. ఇందులో చిరు ‘ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బస్టర్ కొట్టగా… బాలయ్య కెరీర్లో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఇప్పుడు ఈ సీనియర్ స్టార్ హీరోలు మరోసారి బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఎన్బీకే 107’ దసరా కానుకగా రిలీజ్ కానుంది. అలాగే చిరు- మోహన్ రాజా కాంబినేషన్లో ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ కూడా అదే టైంకి రిలీజ్ కాబోతుంది.

ఇందులో బాలయ్య సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది ‘మైత్రి’ వారి నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ అలాగే టీజర్ కూడా ఆకట్టుకుంది. అయితే చిరు ‘గాడ్ ఫాదర్’ నుండి ఎటువంటి టీజర్ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తూండటం విశేషం.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus