కాజల్ వెనుక చిరు ఉన్నాడా??

టాలీవుడ్ లో అప్పట్లో వరుస హిట్స్ తో దూసుకువచ్చింది కాజల్. అయితే ఆ తరువాత మిగిలిన భామల హడావిడి పెరగడంతో సడన్ గా మార్కెట్ ను కోల్పోయి, చేతిలో సినిమాలు లేక కాస్త వెనుక బడింది. ఇక అదే క్రమంలో దాదాపుగా 10ఏళ్ల తరువాత మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాడు మెగాస్టార్ చిరు. తన 150వ సినిమాలోకి హీరోయిన్ కి వెతికే క్రమంలో చిరు కన్ను కాజల్ పై పడింది అని తెలుస్తుంది.

ఇంతవరకూ బాగానే ఉంది అసలు ట్విష్ట్ ఇక్కడే మొదలయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ చేసేందుకు ముందు తమన్నాను బుక్ చేసుకున్నారు మన మైత్రి మూవీస్ వాళ్ళు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తమన్నా ఈ అవకాశం నుంచి తమన్నా తప్పుకుంది. ఇక ఆ పాటలో మరో హీరోయిన్ ని వెతికే క్రమంలో కాజల్ వారి కంట్లో పడింది. ఇక వెంటనే కాజల్ ను సంప్రదించడం, ఆమె సైతం ఒకే చెప్పడం, డీల్ కూడా మాట్లాడుకోవడం చక, చక జరిగిపోయాయి.

అయితే అసలు కధ ఆది కాదు అని, ఎన్టీఆర్ సినిమాలో కాజల్ నటించడానికి చిరు కారణం అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి…కారణం ఎందుకంటే…మెగాస్టార్‌ 150వసినిమాకు ప్రస్తుతం హీరోయిన్‌ చాలా అవసరం, అయితే కాజల్ అయితే చిరు కి కరెక్ట్ అని తలచిన చిరు, ఆమెను ఒప్పించే క్రమంలో….ఆమె క్రేజ్ ను పెంచాలనే ఆలోచనలో జనతా గ్యారేజ్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్ ద్వారా కాస్త పేరు పాపులర్‌ అవ్వమని చెప్పాడట. అందుకే కాజల్ అలా ఐటమ్ భామగా మారినట్లు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus