‘జైలర్’ (Jailer) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ (Rajinikanth) నుండి వచ్చిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’ (Vettaiyan). ‘జై భీమ్’ తో ఆకట్టుకున్న టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana), రావు రమేష్ (Rao Ramesh) కూడా కీలక పాత్రలు పోషించారు. తొలిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎందుకో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. తమిళంలో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులో మాత్రం నిరాశపరిచాయి.
దసరా సెలవులను కూడా ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది.ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ గమనిస్తే :
నైజాం | 3.41 cr |
సీడెడ్ | 1.36 cr |
ఉత్తరాంధ్ర | 0.97 cr |
ఈస్ట్ | 0.45 cr |
వెస్ట్ | 0.38 cr |
గుంటూరు | 0.47 cr |
కృష్ణా | 0.61 cr |
నెల్లూరు | 0.31 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.96 cr |
‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.7.96 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.04 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను కూడా ఇలాగే స్టడీగా క్యాష్ చేసుకుంటే.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.