మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara) తుది మెరుపులు దిద్దుకుంటుంది. సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సినిమా చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది. అది అప్పుడే కంప్లీట్ అయ్యేలా కనిపించడం లేదు అని వినికిడి. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘విశ్వంభర’ సినిమాకి ఉన్న ఇంకో సమస్య ఏంటంటే.. ఈ సినిమాకి ఓటీటీ డీల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు.
సినిమాకి రూ.150 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. కాబట్టి.. అన్ని భాషల్లోని ఓటీటీ రైట్స్ నుండి రూ.75 కోట్లు రాబట్టుకోవాలనేది వారి ఆలోచన. అంటే 50 శాతం రికవరీ వాళ్ళు ఆశిస్తున్నట్టు స్పష్టమవుతుంది. అందుకే ఓటీటీ బిజినెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదట. అయితే ఎట్టకేలకు ‘విశ్వంభర’ కి ఒక ఓటీటీ డీల్ వచ్చిందట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఓ అగ్ర సంస్థ ‘విశ్వంభర’ టీంకి రూ.65 కోట్లు ఆఫర్ చేశారట.
కానీ దీనికి ‘యూవీ సంస్థ’ సముఖంగా లేదట. కానీ వాళ్ళకి ప్రస్తుతానికైతే ఇంకో ఆప్షన్ అయితే లేదని తెలుస్తుంది. అందుకే దీన్ని హోల్డ్ లో పెట్టి.. కొన్ని రోజులు టైం అడిగారు అని సమాచారం. ఈ లోగా ఇంకో మంచి ఆఫర్ వస్తే ఓకే. లేదు అంటే ఈ ఆఫర్ కి వాళ్ళు ఓకే చెప్పేసినట్టే అనుకోవాలి. మరోపక్క.. ‘విశ్వంభర’ ప్యాచ్ వర్క్ అలాగే సాంగ్స్ చిత్రీకరణ వంటివి హైదరాబాద్లో జరుగుతున్నాయి.