చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ తండ్రి కొడుకుల కంటే.. మంచి స్నేహితుల్లా ఉంటారు. అయినా ఒకానొక సందర్భంలో చెర్రీ ని చిరు కోప్పడ్డారంట. నమ్మలేకపొతున్నారు కదూ. ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ చెప్పారు. సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ ఫాదర్స్ డే సందర్భంగా తన ఫేస్ బుక్ పేజీలో నాన్నకు ఫాదర్స్ డే విషెస్ చెబుతూ కొన్ని అరుదైన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. తన తండ్రి చాలా గొప్పమనిషి అంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఒకే ఒకసారి నాన్న తనపై కోప్పడ్డారని, ఆ తర్వాత ఆయన ఎప్పుడూ తనపై కోప్పడిన సందర్భం అసలు లేనే లేదని వివరించారు.
అది ఎందుకంటే.. ఒకసారి అమ్మానాన్నతో కలిసి కూర్చుని మాట్లాడుకొంటున్నప్పుడు ‘వెళదాం పదరా’ అని అమ్మ అనగానే… ‘వెళ్దాంలే…కూర్చో’ అని అమ్మకు ఎదురు చెప్పడంతో నాన్నకు చాలా కోపం వచ్చిందని రామ్ చరణ్ తెలిపారు. “నాన్నకు సాధారణంగా అసలు కోపం రాదు, ఆ రోజు అమ్మకు ఎదురు చెప్పడంతో ఆయనకు కోపం వచ్చింది. అమ్మమాటకు ఎదురు చెప్పకూడదు” అంటూ మందలించిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది అని చెర్రీ గుర్తు చేసుకున్నాడు. తాను హీరోగా నటిస్తున్న సినిమా పనుల్లో బిజీగా ఉంటూనే తండ్రిని ఉయ్యాలవాడ నరసింహ రెడ్డిగా తెరపైన చూపించడానికి నిర్మాతగా చరణ్ కష్టపడుతున్నాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.