Shaheen Khan: 22 ఏళ్ళ తర్వాత ఇలా మెరిసింది.. ‘చిరునవ్వుతో’ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్ వైరల్

2000 వ సంవత్సరంలో వచ్చిన ‘చిరునవ్వుతో’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి ఆ సినిమాని ఎవ్వరూ మర్చిపోలేరు. వేణు హీరోగా జి.రాంప్రసాద్ దర్శకత్వంలో ‘ఎస్.పి.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వెంకట శ్యామ్ ప్రసాద్ నిర్మించిన చిత్రమిది.2000 నవంబర్ 10 న చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడం విశేషం.

ఇది ఒక క్లాసిక్ మూవీ అని చెప్పాలి. మణిశర్మ అందించిన పాటలు కూడా అన్నీ సూపర్ హిట్లే. కామెడీ అయితే అన్ లిమిటెడ్ అన్నట్టు ఉంటుంది. హీరో వేణు కెరీర్ లో ఇదో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షహీన్ ఖాన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యాక ఈమె తెలుగులో బిజీ అవుతుంది అనుకుంటే అలా జరగలేదు. శ్రీకాంత్ – సూర్య కిరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘డార్లింగ్ డార్లింగ్’ సినిమాలో మాత్రమే ఈమె నటించింది.

ఆ సినిమా తర్వాత ఈమెకు (Shaheen Khan) మరో ఆఫర్ రాలేదు. కన్నడలో చేసిన రెండు సినిమాలు ఆడలేదు. దీంతో ఈమెకు ఆఫర్లు లేక ఖాళీగా ఉండిపోయింది. కొన్నాళ్ల తర్వాత వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది షహీన్ ఖాన్. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus