న్యూ లుక్ తో బాక్స్ బద్దలు చెయ్యనున్న చిరు
- February 17, 2016 / 07:44 AM ISTByFilmy Focus
కొంత కాలం గా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న మన ‘కొదమ సింహం’ మెగా స్టార్ చిరంజీవి తన నట విశ్వరూపం చూపించడానికి,మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ తో, అభిమానులను అలరించడానికి రెడీ అయిపోయాడని అభిమానులందరికీ తెలిసిన విషయమే.’కత్తి’ సినిమాలో నటించడానికి బాడీ లో మార్పులకోసం కసరత్తులు చేసిన చిరు తాజాగా తన కూతుళ్ళు,కోడలితో దిగిన ఈ ఫోటో చూస్తుంటే అభిమానులకు మునుపటి చిరు ను చూసిన ఫీలింగ్ కలగకపోదు.బాడీ విషయం లో శ్రద్ధ తీసుకొని చిరు తన బాడీ ని కంట్రోల్ లోకి తెచ్చేసుకున్నాడు.
‘కత్తి’ సినిమాకు సంబంధించిన ఒక పాత్ర లో కొంచెం యంగ్ గా కనిపించాల్సి రావడం తో మలేషియా వెళ్లి సర్జరీ చేయించుకొని,కేరళ లో ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడని వినికిడి.లీడర్ పాత్ర కోసం ఎలా ఉన్న పర్లేదు కానీ మరో పాత్ర లో యంగ్ గా కనిపించాల్సి రావడంతో చిరు శ్రద్ధతో కేర్ తీసుకుంటున్నాడు.
ఆరుపదుల వయసులో ఉన్న మెగాస్టార్ రేపు సినిమాలో డాన్సులు పాత చిరుని గుర్తుచేస్తాడ లేదా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.కాని ఈ గెటప్ లో చిరుని చూసినాక ఇక అబిమనులకి పండగే పండగ అనటం లో ఎటువంటి డౌట్ అవసరం లేదు.ప్రస్తుతం మెగాస్టార్ తన చిన్న కూతురి పెళ్లి పనులలో బిజీ బిజీగా ఉన్నాడు.ఆ టైం లో చిరు ఫ్యామిలీ తో దిగిన ఫోటో ఒకటి బయటి వచ్చింది, ఇప్పుడు మీరు చూస్తున్న పిక్చర్ అదే.ఆ పాత చిరుని మళ్లీ చూడాలంటే ‘కత్తి’ సినిమా పూర్తయ్యేవరకు ఆగాల్సిందే.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















