సురేందర్ రెడ్డి అండ్ టీం ని పరుగులు పెట్టిస్తున్న మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151 వ చిత్రమైన ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నారు. దాదాపు పదేళ్ళ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి.. మొదట ఈ చిత్రాన్నే అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వలన ‘కత్తి’ రీమేక్ తో ఎంట్రీ ఇచ్చారు. ‘సైరా’ చిరంజీవికి చాలా ఇష్టమైన కథంట.

నయనతార హెరాయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయ్యింది. భారీ తారాగణంతో… భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరేకెక్కిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి బాబు లాంటి స్టార్ కాస్టింగ్ ఉండడంతో వారి డేట్లు అడ్జెస్ట్ చేస్తూ… ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అంటే సాధారణ విషయం కాదు. ముఖ్య ప్రదేశాల చిత్రీకరణ కోసం విశ్రాంతి లేకుండా పరిగెట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలో మెగాస్టర్ చిరంజీవి.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి అండ్ టీం కి ఓ డెడ్ లైన్ పెట్టారంట. అంతేకాదు ఇప్పటికే ఈ చిత్రాన్ని దసరా కానుకగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు రాంచరణ్… ‘వినయ విధేయ రామా’ ప్రమోషన్స్ లో కూడా చెప్పేసాడు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చి నెలాఖరుకి పూర్తయ్యిపోవాలని ఆర్డర్ వేశారంట మెగాస్టార్. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకి మరో నాలుగు నెలలైనా పడుతుంది కాబట్టి… దసరా కి చిత్రాన్ని విడుదల చేయాలని చిరు ప్లాన్ అనమాట. అయితే అప్పటికి షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేకపోవడంతో.. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని.. మొదట్నుండీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అండ్ టీం అంచనా వేశారంట. ఇప్పుడు మెగాస్టార్ ఇలా గట్టిగా చెప్పడంతో.. విశ్రాంతి లేకుండా ఈ చిత్ర యూనిట్ షూటింగ్లో పాల్గొంటుందట. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతమందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus