ధృవ నక్షత్రంలో దుమ్ము లేపుతున్న చియాన్ విక్రమ్

సరిగ్గా రెండ్రోజుల క్రితం విడుదలైన “సామి 2” ట్రైలర్ ఏదో అదృష్టం బాగుండి ట్రెండ్ అయిన మాట వాస్తవమే కానీ.. కంటెంట్ పరంగా మాత్రం ప్రేక్షకుల్ని దారుణంగా నిరాశపరిచింది. ముఖ్యంగా.. విక్రమ్ గెటప్, డైలాగ్స్, ఫైట్స్ అన్నీ ఊర మాస్ మసాలా సినిమాలా అనిపించడంతో “ఇదేం ట్రైలర్ రా బాబు, విక్రమ్ ఈ సినిమా ఎందుకు చేస్తున్నాడు అసలు?” అనుకొన్నారు. కట్ చేస్తే.. ఇవాళ విడుదలైన “ధృవ నక్షత్రం” సరికొత్త టీజర్ చూసి “అబ్బా ఏం సినిమా చేస్తున్నాడ్రా విక్రమ్” అని గర్వపడేలా చేశాడు.

హాలీవుడ్ సినిమాల స్థాయిని మించేలా ఉన్న “ధృవ నక్షత్రం” టీజర్ ప్రస్తుతం విశేషమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో విక్రమ్ స్పెషల్ ఏజెంట్ గా నటిస్తుండగా.. రీతువర్మ హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత కొంతకాలంగా సరైన ఫండ్స్ లేక షూటింగ్ కొంత పెండింగ్ ఉండిపోయి ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేకుండాపోయింది. అయితే.. ఇప్పుడు లైకా సంస్థ సినిమాను హ్యాండోవర్ చేసుకోవడంతో సినిమా మళ్ళీ పట్టాలమీదకు వచ్చింది. ఇక ఇవాళ విడుదలైన టీజర్ అయితే అంచనాలను అమాంతం పెంచేంసింది. హాలీవుడ్ పాపులర్ సిరీస్ “ది ఎక్స్ పెండబల్స్”ను తలపిస్తూ అంచనాలను పెంచేస్తోంది. సో, సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus