Chiyaan Vikram: ఆ విషయంలో విక్రమ్ కు పోటీ లేనట్టే.. అవార్డ్స్ రావాలంటూ?

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్  (Chiyaan Vikram )  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్రమ్ సినీ కెరీర్లో అపరిచితుడు సినిమా ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. శంకర్ (Shankar) డైరెక్షన్లో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలో విక్రమ్ మూడు పాత్రల్లో నటించగా తను తప్ప మరే హీరో ఆ పాత్రలలో నటించలేరు అనేంత అద్భుతంగా విక్రమ్ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే అపరిచితుడు సినిమా తర్వాత విక్రమ్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా అపరిచితుడు రేంజ్ హిట్ అయితే విక్రమ్ కు దక్కలేదు.

Chiyaan Vikram

ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన తంగలాన్ (Thangalaan) సినిమాతో విక్రమ్ కు ఆ లోటు భర్తీ అయిందని చెప్పాలి. తంగలాన్ సినిమాకు క్రిటిక్స్ నుంచి పూర్తిస్థాయిలో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. పా రంజిత్  (Pa. Ranjith)  డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కగా దర్శకుడు పా రంజిత్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. కొంతమంది తమిళ అభిమానులు ఈ సినిమా కోలీవుడ్ బాహుబలి అని కామెంట్లు చేస్తున్నారంటే ఈ సినిమా వాళ్లను ఏ స్థాయిలో ఆకట్టుకుందో సులువుగానే అర్థమవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో తంగలాన్ సినిమాకు నాలుగు కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తంగలాన్ మూవీ సాధిస్తున్న కలెక్షన్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారని సమాచారం అందుతోంది. సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉన్నా పాజిటివ్ పాయింట్లు ఎక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. మరోవైపు తంగలాన్ సినిమాలో విక్రమ్ నటనకు ఎక్కువ సంఖ్యలో అవార్డులు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

విక్రమ్ యాక్టింగ్ స్కిల్స్ కు జాతీయ అవార్డులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. తంగలాన్ సినిమాకు సీక్వెల్ గా తంగలాన్ 2 తెరకెక్కనుండగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. విక్రమ్ ఖాతాలో మరిన్ని భారీ బ్లాక్ బస్టర్ హిట్లు చేరాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. విలక్షణమైన పాత్రల్లో అద్భుతంగా నటించే విషయంలో విక్రమ్ కు పోటీ లేనట్లేనని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘డబుల్ ఇస్మార్ట్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus