Chiyaan Vikram: సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విక్రమ్‌ వీడియో!

విక్రమ్‌ సినిమాలో కథతోపాటు వెరైటీ కూడా ఉండాల్సిందే. వైవిధ్యానికి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్‌ అలాంటిది మరి. అందుకే ఇన్నేళ్లుగా సినిమా పరిశ్రమలో రాణిస్తున్నారు. విజయాల విషయం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే ఆయన వైవిధ్యం సినిమాల్లోనే కాకుండా బయట కూడా చూపిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ట్విటర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ విషయాన్ని కూడా చాలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అభిమానులకు దగ్గరగా ఉండటానికి సినిమా తారలు వాడుతున్న ఆయుధం సోషల్‌ మీడియా. తమ గురించి, తమ సినిమాల గురించి ఏ విషయం చెప్పాలన్నా.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రాసేస్తే చాలు. అయితే విక్రమ్‌ మాత్రం ఇన్నాళ్లూ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడెప్పుడో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. అయితే తాజాగా విక్రమ్‌ ట్విటర్‌లోకి వచ్చారు. రావడం రావడమే జోకుతో వైరల్‌ అయిపోయారు. ఎన్నో ఏళ్ల నుండి పరిశ్రమలో ఉన్న విక్రమ్‌కు ఇప్పటివరకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ లేదంటేనే ఆయన సోషల్‌ మీడియా స్టేట్‌ అర్థమవుతోంది.

ఎప్పుడో ఉండి, ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా వాడటం మానేశారు అంటే ఓకే. కానీ ఏకంగా ఖాతానే లేదు. అయితే అభిమానుల కోరిక మేరకు 2016లో నుండి ఇన్‌స్టా గ్రామ్‌లో ఖాతా ప్రారంభించారు. The_real_chiyaan అనే యూజర్‌ హ్యాండిల్‌తో ఆయనకు ఇన్‌స్టాలో అకౌంట్‌ ఉంది. తన ఇష్టాయిష్టాలు, కొత్త సినిమా విశేషాలు, షూట్‌ లొకేషన్స్‌ అంటూ ఇలా ఎన్నో అంశాలను ఆయన పంచుకుంటున్నారు. ట్విటర్‌లోకి వస్తున్నట్లు తెలియజేస్తూ శుక్రవారం రాత్రి ట్విటర్‌లో ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశాడు విక్రమ్‌.

ఆ వీడియోలో విక్రమ్‌ పొడవాటి గడ్డంతో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించారు. ‘‘నేను మీ చియాన్‌ విక్రమ్‌. నిజంగా నేనే. డూప్‌ కాదు. నా నెక్స్ట్‌ సినిమా కోసం ఇలా సిద్ధమవుతున్నా. చాలా ఆలస్యంగా వచ్చాను. ఏం అనుకోకండి. కానీ ఇది సరైన సమయమనే అనుకుంటున్నా. మీరు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇకపై మీకు ట్విటర్‌లోనూ అందుబాటులో ఉంటాను’’ అని ఆ విక్రమ్‌లో చెప్పాడు విక్రమ్‌. విక్రమ్‌ మాటలకు మురిసిపోయి అభిమానులు ఆ వీడియోను వైరల్‌ చేస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus