డైట్ ప్లాన్ ను చెప్పేసిన కొరియోగ్రాఫర్ భార్య.. ఎలా తగ్గారంటే?

ఈరోజుల్లో బరువు తగ్గడం చాలా పెద్ద సమస్యగా మారింది. ఎంతో కష్టపడితే మాత్రమే 30 నుంచి 40 కిలోల బరువు తగ్గడం సాధ్యమవుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు ఊబకాయానికి కారణం కాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ భార్య తాను 40 కిలోల బరువు తగ్గానని చెప్పానని అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రెమో డిసౌజా భార్య లిజెల్ డిసౌజా బరువు తగ్గిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒకప్పుడు అధిక బరువుతో ఇబ్బంది పడిన లిజెల్ డిసౌజా బరువు తగ్గాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తగ్గి చూపించారు.

అప్పటికీ ఇప్పటికీ ఆమె లుక్ లో వచ్చిన మార్పును చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతంలో 105 కేజీల బరువు ఉన్న లిజెల్ బరువు తగ్గడం కోసం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ను ఫాలో అయ్యారు. ఈ విధంగా చేయడం ద్వారా ఆమె సులువుగా బరువు తగ్గగలిగారు. ఆ తర్వాత వెయిట్ ట్రైనింగ్ తో పాటు జిమ్ లో వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గారు. డైట్ పై దృష్టి పెడితే బరువు తగ్గడం సాధ్యమేనని ఆమె ప్రూవ్ చేశారు.

ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులువుగా సాధ్యమవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. బరువు తగ్గాలని భావించే ఎంతోమందికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు వైద్యుల సలహాలను పాటించి ఈ విధంగా బరువు తగ్గితే మంచిదని చెప్పవచ్చు. లిజెల్ డిసౌజా ఈ విధంగా బరువు తగ్గారంటే గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎంతోమందికి ఆమె ఆదర్శంగా నిలిచారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. లీజెల్ డిసౌజాకు సోషల్ మీడియాలో క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరుగుతోంది. లిజెల్ డిసౌజాలా బరువు తగ్గాలంటే ఇష్టమైన ఆహారానికి కొంతకాలం దూరం కాక తప్పదు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus