ఒకరోజు ముందే మొదలవుతున్న సినిమా సందడి

ఫిబ్రవరి 14న అనే తేదీ యువతకు ఎంత కీలకమైన అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో ఈరోజును సెలబ్రేట్ చేసుకుంటే.. గర్ల్ ఫ్రెండ్స్ లేనివాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని ఎదురుచూస్తుంటారు. కానీ.. ఈ ఫిబ్రవరి 14న మూవీ లవర్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రం ఒక మంచి రీజన్ దొరికింది. ఫిబ్రవరి 14న అనగా రేపు రెండు తెలుగు సినిమాలు, ఒక హిందీ సినిమా విడుదలవుతున్నాయి. మూడూ దేనికదే విభిన్నమైన సినిమాలు కావడం విశేషం.

ఒక్కసారి కన్నుకొట్టి రాత్రికి రాత్రి సెన్సేషనల్ స్టార్ అయిపోయిన ప్రియా వారియర్ నటించిన “లవర్స్ డే” ప్రత్యేకించి వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతుండగా.. కార్తీ-రకుల్ జంటగా నటించిన ‘దేవ్’ కూడా రేపు విడుదలకానుంది. ఈ రెండు సినిమాలతోపాటు బాలీవుడ్ మోస్ట్ క్రేజీ యాక్టర్ రణవీర్ సింగ్ నటించిన “గల్లీ బోయ్” కూడా విడుదలవుతోంది. ఈ మూడు సినిమాల మీద మంచి అంచనాలే ఉన్నాయి. మూడూ వేటికవే వైవిధ్యమైన సినిమాలు కావడంతో మూవీ లవర్స్ ఈ వాలెంటైన్ డేన్ ను తమకు నచ్చిన సినిమాలతో సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus