Rathnavelu: ‘దేవర’ కోసం తమ కష్టాన్ని చెప్పిన స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌.. అన్ని రోజులు.!

సినిమా అంటే ఒకరిద్దరు చేసే పని కాదు.. అలాగే ఒకట్రెండు రోజుల్లో అయ్యే పని కూడా కాదు. రాత్రి, పగలూ అనక పని చేస్తేనే మనం సినిమాను చూడగలుగుతున్నాం. ఈ విషయం కొత్తేమీ కాదు ఎన్నో ఏళ్లుగా సినిమాలు ఇలానే తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రతి సినిమాకూ ఆ కష్టం గురించి మాట్లాడుకోవడం పరిపాటే. అయితే ఒక్కోసారి ఆ కష్టం గురించి విన్నప్పుడు.. వామ్మో అనిపిస్తుంది. సినిమా అంటే ఇంత కష్టమా అని కూడా అనిపిస్తుంది.

Rathnavelu

ఇప్పుడు అలాంటి ఫీలింగే కలిగిస్తున్న సినిమా ‘దేవర’(Devara) . అలాంటి డిస్కషన్‌ రావడానికి కారణం ఆ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన రత్నవేలు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు. సెప్టెంబరు 27న రిలీజ్‌ అవుతున్న ‘దేవర’ సినిమా గురించి భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రెండు పార్టుల సినిమాలో తొలి పార్టు ఆ రోజు వస్తోంది. ఈ నేపథ్యంలో వీఎఫ్‌ఎక్స్‌పై రత్నవేలు (R. Rathnavelu) పెట్టిన పోస్ట్‌ అంచనాలను రెట్టింపు చేసింది.

‘దేవర’ సినిమా కలర్‌ గ్రేడింగ్‌, మ్యాచింగ్‌ వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపామని రత్నవేలు ఆ పోస్టులో రాసుకొచ్చారు. ప్రీమియర్‌ లార్జ్‌ ఫార్మట్‌, డీ బాక్స్‌, 4 డీఎక్స్‌, ఓవర్సీస్‌ 2.35 ఎమ్‌ఎమ్‌ కంపెనీలు పని చేశాయి. ఆ అదిరిపోయే కంటెంట్‌తో వస్తున్న మా ‘దేవర’ను థియేటర్‌లలో చూసి ఆనందించండి అని పోస్టును ముగించారు. దాంతోపాటు ఎన్టీఆర్‌తో దిగిన ఫొటో.. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు పిక్‌ షేర్‌ చేశారు.

‘దేవర’ గురించి రత్నవేలు మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. సినిమా విజువల్‌ వండర్‌ అని ఓసారి ఇలానే మాట్లాడారు. పాటల గురించి, డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌ గ్రేస్, స్టైల్, ఎలక్ట్రిఫైయింగ్‌ స్టెప్స్‌ గురించి చెప్పారు. వెండితెరపై చూస్తే థియేటర్లలో పూనకాలు పక్కా అని చెప్పారు. ఇప్పుడు మరోసారి అదే చేశారు. మరి రత్నవేలు చెప్పినట్లుగా థియేటర్లలో పూనకాలు వస్తాయా? అనేది చూడాలి.

 ‘ప్రభాస్ 25’ : ఇది చిన్న కథ కాదుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus