Salaar: ప్రభాస్‌ సినిమాలో ఆ హీరోయిన్‌ ఐటెమ్‌ సాంగ్‌… ఇదిగో క్లారిటీ

‘సలార్‌ 2’ (Salaar) సినిమా పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. వీలైనంత త్వరగా సినిమాను సెట్స్‌పైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది టీమ్. ఈ సినిమా మొదలయ్యేలోపు ప్రభాస్‌ (Prabhas) మిగిలిన సినిమాల పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో ‘సలార్‌ 2’ గురించి రోజుకో పుకారు బయటికొస్తోంది. ఈ సినిమా స్పాన్‌ను ఇంకాస్త పెంచే ప్రయత్నంలో ఓ బాలీవుడ్‌ బ్యూటీని తీసుకొచ్చి స్పెషల్‌ సాంగ్‌ పెడతారు అని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.

ప్రభాస్ – ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్‌’. 2023 డిసెంబరులో విడుదలైన ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో భారీ విజయం అందుకుంది. రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో సీక్వెల్‌గా తెరకెక్కనున్న ‘సలార్‌: శౌర్యాంగ పర్వం’ సినిమా కోసం ప్రభాస్‌ అభిమానులు, సినిమా ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి చిన్న వార్త కూడా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ (Kiara Advani) కీలక పాత్రలో కనిపించనుందని వార్తలొచ్చాయి.

అలాగే ఆమె ప్రత్యేక గీతంలో ఆడిపాడుతుందని కూడా ప్రచారం జరిగింది. నిజమే ఏమో అని ఫ్యాన్స్‌ అనుకుంటుండగా… అవన్నీ రూమర్సేనని సన్నిహితులు మీడియాకు చెప్పారు. ‘సలార్‌’ టీమ్‌ కియారాను సంప్రదించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ ఉందనేది మాత్రం పక్కా అని అంటున్నారు. కియారా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘భరత్‌ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమాలో మహేష్‌ బాబు (Mahesh Babu) సరసన నటించి మెప్పించింది.

ఆ తర్వాత ఈ భామ ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) సినిమాలోనూ నటించింది. ఇప్పుడు రామ్ చరణ్‌ (Ram Charan) సరసన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) సినిమాలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని సినిమాలో ఆమె నటించే అవకాశం ఉందని అంటున్నారు. అవేంటో త్వరలో తెలుస్తాయి అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus