ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై దాడి జరిగినట్లు గత రెండు రోజులుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. కారణమేంటి అనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ విషయం మాత్రం అదే అంటూ వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఇప్పుడు చిన్నపాటి క్లారిటీ వచ్చింది. ఆ రోజు దాడి వెనుక జరిగిన విషయం ఇదీ అంటూ వార్తలొస్తున్నాయి. ఇటీవల కన్నుమూసిన కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించడానికి… విజయ్ సేతుపతి బెంగళూరు వెళ్లారు.
ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా సిబ్బందితో ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వెళ్లసాగారు విజయ్ సేతుపతి. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి… విజయ్ సేతుపతి పక్కన ఉన్న సహాయకుడిపై దాడి చేశాడు. వెనుక నుండి వచ్చి ఎగిరి కాలితో తన్నడం ఆ వీడియో చూసే ఉంటారు. తొలుత ఆ వ్యక్తి విజయ్ సేతుపతిని కొట్టాడని అనుకున్నారు. నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాడికి యత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు.
ఈ ఘటన జరిగడానికి కొద్దిసేపు ముందు మద్యం సేవించి ఉన్న ఆ వ్యక్తి (దాడికి పాల్పడిన వ్యక్తి)తో విజయ్ సేతుపతి సహాయకుడు వాగ్వాదానికి దిగాడని అక్కడ ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. ఆ కోపంతోనే ఆ వ్యక్తి విజయ్ సహాయకుడిని కాలితో తన్నాడని తెలుస్తోంది. అయితే భద్రతా సిబ్బంది జోక్యంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగిందని సమాచారం. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పాడని కూడా తెలుస్తోంది.