Rajamouli: రాజమౌళి ఆ విషయంలో వెనక్కి తగ్గరా..?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 నుంచి బాహుబలి2 వరకు సినిమాసినిమాకు తన మార్కెట్ ను, రెమ్యునరేషన్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ సినిమాలలో ఎక్కువ భాగం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. బాహుబలి సక్సెస్ కావడానికి పరోక్షంగా రామోజీ రావు సాయం చేశారని ఆ సినిమాకు రామోజీ రావు ఫైనాన్స్ చేశారనే కామెంట్లు వినిపించాయి. ఐతే బాహుబలి సిరీస్ సినిమాల రిలీజ్ సమయంలో రాజమౌళి, రామోజీ రావు, నిర్మాతల మధ్య విభేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలపై రాజమౌళి మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమా షూటింగ్ ను రామోజీ ఫిలిం సిటీలో చేయడానికి రాజమౌళి ఇష్టపడటం లేదు. ఇతర స్టూడియోలలో షూటింగ్ చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నా రాజమౌళి మాత్రం వెనక్కు తగ్గడం లేదు. రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసి ఉంటే ఈపాటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తై ఉండేదని సమాచారం. రామోజీతో రాజమౌళికి గట్టిగా చెడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

మరోవైపు ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ షూటింగ్ మొదలు కావడంతో ఈ సినిమా చెప్పిన డేట్ కు రిలీజవుతుందా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. షూటింగ్ పూర్తైన తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ గురించి స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus