NTR: అలా నినాదాలు చేయడం తారక్ కు నచ్చలేదా.. అసలేం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో సైమా అవార్డ్ ను అందుకున్నారు. కొన్నేళ్ల క్రితం జనతా గ్యారేజ్ సినిమాతో సైమా అవార్డ్ ను అందుకున్న తారక్ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మరో అవార్డ్ ను ఖాతాలో వేసుకున్నారు. అయితే తారక్ అవార్డ్ తీసుకున్న తర్వాత కొంతమంది అభిమానులు సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అయితే గతంలో ఈ స్లోగన్స్ విషయంలో తారక్ పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు.

అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నినాదాలు రైట్ కాదని భావించిన తారక్ సీరియస్ లుక్ ఇచ్చారు. రాజకీయాలపై ప్రస్తుతానికి ఎలాంటి ఆసక్తి లేదని సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టేలా స్లోగన్స్ చేయవద్దని తారక్ చెప్పకనే చెప్పేశారు. సీఎం ఎన్టీఆర్ అనే స్లోగన్స్ వినిపించడం ఇదే తొలిసారి కాదు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు వేరు అనే సంగతి తెలిసిందే.

చంద్రబాబు అరెస్ట్ గురించి తారక్ స్పందించలేదని సోషల్ మీడియా వేదికగా కొంతమంది కామెంట్లు చేస్తుండగా స్పందిస్తాడో లేదో తారక్ వ్యక్తిగతం అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిసే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఆలస్యంగానైనా తన స్పందన తెలియజేసే అవకాశం అయితే ఉంది. ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ను కలిగి ఉన్న ఎన్టీఆర్ దేవర సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవర ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus